For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దెబ్బకు దెబ్బ: అమెరికా ఏం కోరుతోంది, ట్రంప్‌కు భారత్ ఇచ్చే ఆఫర్ ఏమిటి?

|

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాలు, టారిఫ్ వంటి అంశాలే ప్రధానంగా చర్చనీయాంశమవుతున్నాయి. ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో గుజరాత్, ఢిల్లీలలో ఉంటారు. ట్రంప్ పర్యటన సందర్భంగా వాణిజ్యం, సుంకాలపై మరింత సహకారం, ప్రధాన రక్షణ ఒప్పందాలకు అవకాశముంటుందని భావిస్తున్నారు.

ట్రంప్ పర్యటన: అమెరికా-భారత్ వాణిజ్య కథనాలు

20 ఏళ్లలో భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఇలా

20 ఏళ్లలో భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఇలా

ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్య దేశాలు ఒకదానికొకటి స్థిరమైన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో టారిఫ్ అంశం ఒకింత వాణిజ్య ఉద్రిక్తతలకు కారణంగా మారింది. గూడ్స్ అండ్ సర్వీసెస్‌లో అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ 1999 నుండి 2019 నాటికి క్రమంగా 16 బిలియన్ డాలర్ల నుండి 142 బిలియన్ డాలర్లకు పెరిగింది. వాణిజ్య లోటు ఆందోళన కలిగిస్తోన్న అంశం.

టారిఫ్ పెంచిన ట్రంప్ ప్రభుత్వం

టారిఫ్ పెంచిన ట్రంప్ ప్రభుత్వం

2018 మార్చిలో భారత్ నుండి దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియంపై వరుసగా 25 శాతం, 10 శాతం టారిఫ్ పెంచింది ట్రంప్ ప్రభుత్వం. ఆ తర్వాత జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP) రూపంలో షాకిచ్చింది. దీంతో భారత ఉత్పత్తులపై ప్రభావం పడింది. భారత్, చైనా వంటి దేశాలు అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు పొందుతున్నాయని అమెరికా పలుమార్లు అక్కసు వెళ్లగక్కింది.

భారత్ దెబ్బకు దెబ్బ

భారత్ దెబ్బకు దెబ్బ

దెబ్బకు దెబ్బ అన్నట్లుగా.. భారత్ కూడా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై భారీ టారిఫ్ విధించింది. అల్మోండ్స్, వాల్‌నట్స్, కాజూ, ఆపిల్స్, చిక్‌పీస్, గోదుమలు, బఠానీ వంటి వాటిపై మోడీ ప్రభుత్వం టారిఫ్స్ పెంచింది. దీంతో అమెరికాకు చెందిన ఈ ఉత్పత్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వీటిపై కూడా అమెరికా దృష్టి

వీటిపై కూడా అమెరికా దృష్టి

వ్యవసాయ ఉత్పత్తులతో పాటు మేధో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటక్షన్, ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్, హార్లీడేవిడ్సన్, వైద్య ఉత్పత్తులు తదితరాలపై ట్రంప్ ప్రభుత్వం ఈ పర్యటనలో దృష్టి సారించింది.

వీటిపై భారీ టారిఫ్

వీటిపై భారీ టారిఫ్

ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్ భారీగా టారిఫ్ వసూలు చేస్తోంది. వీటిని ఉపసంహరించాలని, GSP కింద భారత్‌కు ప్రయోజనాలు కల్పించకపోవడంతో నష్టపోతున్నామని భారత్ చెబుతోంది.

అమెరికా ఏం కోరుకుంటుందంటే?

అమెరికా ఏం కోరుకుంటుందంటే?

గుండె స్టంట్స్, కృత్రిమ మోకాలి చిప్పలపై ధరల నియంత్రణ విధించవద్దు. హార్లీడేవిడ్సన్ బైక్స్‌పై సుంకాలు తగ్గించాలి. అమెరికా పాడి, వ్యవసాయ ఉత్పత్తులకు భేషరతు మార్కెట్ సదుపాయం కల్పించాలి. ఇరుదేశాల వాణిజ్య లోటు తగ్గించాలి. అమెరికా ఫలాలకు మార్కెట్ సదుపాయం ఉండాలి. WTOలో ఫిర్యాదులను పరస్పరం ఉపసంహరించుకోవాలి. అమెరికా ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉత్పత్తులపై టారిఫ్ తగ్గించాలి. ప్రతీకార టారిఫ్స్ ఉండవద్దు.

భారత్ ఏం కోరుకుంటోంది?

భారత్ ఏం కోరుకుంటోంది?

ఇనుము, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్ తగ్గించాలి. మామిడిపళ్లు, ద్రాక్షకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించాలి. పండ్ల ఎగుమతిదారులకు అనుమతులు ఈజీగా రావాలి. GSP కింద ఎగుమతి ప్రయోజనాలు పునరుద్ధరించాలి. వ్యవసాయం, వాహనాలు, వాహన విడిభాగాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులను అమెరికాలో మరింతగా విక్రయించేందుకు అనుమతులు ఉండాలి.

వాణిజ్య లోటు

వాణిజ్య లోటు

భారత్-అమెరికా మధ్య 2018-19లో వాణిజ్య లోటు రూ.1,609 కోట్ల డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏడు శాతం తగ్గింది. ఈ లోటు పూడ్చాలని, భారత్ ఎంత ఎగుమతి చేస్తే అంత దిగుమతి చేసుకోవాలనేది అమెరికా డిమాండ్.

భారత్ ఆఫర్లు ఇవే..

భారత్ ఆఫర్లు ఇవే..

ఆధునాతన బైక్స్‌కు సింగిల్ డిజిట్ టారిఫ్ విధిస్తామని అమెరికాకు భారత్ ఆఫర్ చేస్తోంది. అంటే 1 శాతం నుంచి 9 శాతం మధ్య టారిఫ్ ఉంటుందని తెలిపింది. వైద్య పరికరాల ధరల నిర్ణయంలో ట్రేడ్ మార్జిన్స్‌కు అనుమతిస్తామని తెలిపింది.

English summary

దెబ్బకు దెబ్బ: అమెరికా ఏం కోరుతోంది, ట్రంప్‌కు భారత్ ఇచ్చే ఆఫర్ ఏమిటి? | Trump India visit: India US trade booster

What is the prospect of cooperation on trade and tariffs, and will the key sticking points be overcome?
Story first published: Sunday, February 23, 2020, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X