For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాపై ఆధారపడితే అంతే..: భారత ఆర్థిక వ్యవస్థపై పెనుభారం.. ఎంతంటే?

|

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం పడనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఇప్పటికే నివేదికలు వెల్లడించాయి. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే దాదాపు 15 దేశాల్లో భారత్ ఉంది. ఈ మేరకు ఐక్య రాజ్య సమితి తాజాగా ప్రకటన చేసింది. ఇది భారత వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది.

కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్

భారత ఆర్థిక వాణిజ్యంపై 348 మిలియన్ డాలర్ల ప్రభావం

భారత ఆర్థిక వాణిజ్యంపై 348 మిలియన్ డాలర్ల ప్రభావం

కరోనా వైరస్ ప్రభావం పడే 15 దేశాల్లో భారత్ ఉందని, ఈ కారణంగా భారత్ సహా ఈ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడనుందని ఐక్య రాజ్య సమితి పేర్కొంది. భారత వాణిజ్యంపై 348 మిలియన్ డాలర్ల మేర (రూ.34.8 కోట్ల డాలర్లు) ప్రభావం పడుతుందని అంచనా వేసింది.

50 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం

50 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో తయారీ మందగించిందని, ఇది ప్రపంచ వాణిజ్యానికి విఘాతం కలిగిస్తోందని ఐక్య రాజ్య సమితి తన నివేదికలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 50 బిలియన్ డాలర్ల ఎగుమతులు తగ్గిపోవచ్చునని అంచనా వేసింది. అంటే రూ.5వేల కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులపై ప్రభావం.

వీటిపై భారీ ప్రభావం

వీటిపై భారీ ప్రభావం

కరోనా వైరస్ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాల్లో అవసరమైన పరికరాలతో పాటు యంత్రాలు, ఆటోమోటివ్, కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నట్లు తెలిపింది. చైనా నుండి ఎక్కువ ముడి పదార్థాలు సరఫరా అవుతాయి. ఇవన్నీ నిలిచిపోవడంతో దాదాపు ప్రతి రంగంపై ప్రభావం పడుతోంది.

ఈ దేశాలపై భారీ ప్రభావం

ఈ దేశాలపై భారీ ప్రభావం

కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమయ్యే వాటిలో యూరోపియన్ యూనియన్ (USD 15.6 billion), అమెరికా (USD 5.8 billion), జపాన్ (USD 5.2 billion), సౌత్ కొరియా (USD 3.8 billion), చైనాలోని తైవాన్ ప్రావిన్స్ (USD 2.6 billion), వియత్నాం ( USD 2.3 billion) ఉన్నాయి. 15 ప్రభావిత దేశాల్లో ఇండియా ఉంది.

వాటితో పోల్చుకుంటే భారత్‌పై కాస్త తక్కువ ప్రభావం

వాటితో పోల్చుకుంటే భారత్‌పై కాస్త తక్కువ ప్రభావం

యూరోపియన్ యూనియన్, అమెరికా, జపాన్, సౌత్ కొరియాతో పోల్చితే వాణిజ్యంపై ప్రభావం భారత్ పైన కాస్త తక్కువే. ఇండోనేషియాపై వాణిజ్య ప్రభావం 312 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఐరాస తెలిపింది.

భారత్‌లో ఏయే రంగాలపై ఎంత అంటే

భారత్‌లో ఏయే రంగాలపై ఎంత అంటే

భారత్ విషయానికి వస్తే వాణిజ్యంపై కెమికల్ రంగంపై 129 మిలియన్ డాలర్లు, టెక్స్‌టైల్స్, దుస్తుల రంగంపై 64 మిలియన్ డాలర్లు, ఆటోమోటివ్ సెక్టార్‌పై 34 మిలియన్ డాలర్లు, ఎలక్ట్రికల్ మిషనరీపై 12 మిలియన్ డాలర్లు, లెదర్ ఉత్పత్తులపై 13 మిలియిన్ డాలర్లు, మెటల్స్ అండ్ మెటల్ ఉత్పత్తులపై 27 మిలియన్ డాలర్ల ప్రభావం పడింది. అలాగే, కలప, ఫర్నీచర్ ఉత్పత్తులపై 15 మిలియన్ డాలర్ల ప్రభావం పడుతుంది.

చైనాపై ఆధారపడితే.. అతలాకుతలం

చైనాపై ఆధారపడితే.. అతలాకుతలం

గత నెల రోజులుగా చైనాలో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) 37.5 శాతానికి పడిపోయింది. ఇది 2004 తర్వాత అత్యంత కనిష్టం. ప్రపంచవ్యాప్తంగా చైనా ముడి సరుకులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కానుంది.

English summary

చైనాపై ఆధారపడితే అంతే..: భారత ఆర్థిక వ్యవస్థపై పెనుభారం.. ఎంతంటే? | Trade impact of Coronavirus for India estimated at dollar 348 million

India is among the 15 most affected economies due to the coronavirus epidemic and slow down in production in China.
Story first published: Thursday, March 5, 2020, 13:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X