For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు; నేడు హైదరాబాద్, ప్రధాన నగరాల్లో ధరలిలా!!

|

మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కాస్త రిలీఫ్ ఇస్తున్నాయి. గత మూడు రోజులుగా వరుసగా బంగారం ధరలు తగ్గుతున్న పరిస్థితి బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇటీవల కాలంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తీరు కొనుగోలుదారులలో కాస్త ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తున్నాయి. గత రెండు రోజులుగా భారీగా పడిపోయిన బంగారం ధరలు, నేడు కూడా మరో మారు భారీగా పతనాన్ని చూసాయి.

నేడు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ లలో బంగారం ధరలు ఇలా

నేడు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ లలో బంగారం ధరలు ఇలా

ఈరోజు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరల విషయానికొస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,400 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 57,160 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,400 ప్రస్తుతం కొనసాగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,160 రూపాయలుగా కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,550గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,310 గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

ముంబై, బెంగళూరు, చెన్నై,లలో బంగారం ధరలు ఇలా

ముంబై, బెంగళూరు, చెన్నై,లలో బంగారం ధరలు ఇలా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 52,400 రూపాయలుగా ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 57,160 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక బెంగళూరులో నేడు బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 52,450 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు బెంగళూరులో 57,210 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,350 ప్రస్తుతం కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో 58,200గా ట్రేడ్ అవుతుంది.

 దేశంలో భారీగా పతనమైన వెండి.. ధరలిలా

దేశంలో భారీగా పతనమైన వెండి.. ధరలిలా

ఇక వెండి విషయానికి వస్తే ప్రస్తుత హైదరాబాద్లో కిలో వెండి 74,200 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కూడా గత రెండు రోజులు వ్యవధిలో 3600 మేర పతనం కావడం ప్రధానంగా కనిపిస్తుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి తీసుకుంటున్న అనేక నిర్ణయాలు బంగారం పతనానికి కారణం అవుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లు 25 బేసిన్ పాయింట్ల మేర పెంచడంతో బంగారం, వెండి ధరలు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం కొనసాగుతున్న బంగారం ధరల పతనం బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట ఇస్తుంది.

English summary

బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు; నేడు హైదరాబాద్, ప్రధాన నగరాల్లో ధరలిలా!! | Todays Gold rate in hyderabad:Yellow metal rates tend to decline,huge relief

The falling gold prices are good news for gold lovers. Gold prices, which reached record highs in the recent past, are now on the decline, giving buyers a bit of an optimistic outlook.
Story first published: Monday, February 6, 2023, 10:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X