For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Kisan: రైతులకు శుభవార్త.. సెప్టెంబర్ 30లోపు ఖాతాల్లో పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు..!

|

రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా అన్నదాతలకు సంవత్సరాని రూ.6 వేలు ఇస్తోంది. మూడు విడతలుగా నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమా చేస్తోన్నారు. ఇప్పటికే 11 విడతలుగా రూ.22 వేలు అన్నదాత బ్యాంకు ఖాతాల్లో జమా చేశారు.

సెప్టెంబర్ 30

సెప్టెంబర్ 30

త్వరలో 12వ విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ నెలలో దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాల్లో 2000 రూపాయలు జమా అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 12వ విడత సొమ్ము సెప్టెంబర్ 30 వరకు ఖాతాల్లోకి రావచ్చని సమాచారం. అయితే ఈకేవైసీ చేసుకున్న వారికే 12 విడత డబ్బులు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఇలా చెక్ చేసుకోండి

ఇలా చెక్ చేసుకోండి

1.ముందుగా https://pmkisan.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2.హోమ్ పేజీలో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3.ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

4. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చ ఎంటర్ చేసి సడ్మిట్ చేయాలి.

5.మీ ఎన్ని విడతల డబ్బు వచ్చిందో అందులో తెలుస్తుంది

ఈకేవైసీ తప్పనిసరి

ఈకేవైసీ తప్పనిసరి

పీఎం కిసాన్ యోజన కింద రైతులు డబ్బులు పొందాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి. ఇందకు కోసం కేంద్రం ఆగస్ట్ 31 వరకు గడవు పొడగించారు. అలోపి ఈకేవైసీ చేసుకోవాలని కేంద్రం రైతులను కోరింది.

ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే..

ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే..

Step 1: ముందుగా అధికారిక వెబ్ సైట్ pmkisan.nic.in కి లాగిన్ అవ్వాలి.

Step 2: అందులో Farmers Corner కింద ఉన్న eKYC ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

Step 3: OTP ఆధారిత eKYC కోసం మీ ఆధార్ నంబర్ అందించండి.

Step 4: ఆ తరువాత సెర్చ్ ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5: ఆ తరువాత ఆధార్ లింక్ చేయబడిన మెుబైల్ నంబర్ ఎంటర్ చేసి.. Get OTP ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 6: ఆ తరువాత మీ మెుబైల్ కు వచ్చిన ఓటీపీ నంబర్ ఎంటర్ చేయండి.

Step 7: అందించిన వివరాలు పూర్తిగా వెరిఫికేషన్ అయ్యాక eKYC ప్రక్రియ పూర్తవుతుంది.

English summary

PM Kisan: రైతులకు శుభవార్త.. సెప్టెంబర్ 30లోపు ఖాతాల్లో పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు..! | Till September 30, 12 installments of PM Kisan will be deposited in farmers' accounts

PM Kisan 12th tranche money will be deposited in farmers' accounts till September 30. But the Center says that only those who have done EKYC will get 12th batch boxes.
Story first published: Saturday, September 24, 2022, 9:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X