For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాక్‌డౌన్ నుండి ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులా ఈ 5 రాష్ట్రాలు! అసలు ప్యాకేజీ 'మనీ' కాదు..!

|

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి 25వ తేదీ నుండి ప్రారంభమైన లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కంటైన్మెంట్ ప్రాంతాల్లో తప్పితే మిగతా ప్రాంతాల్లో దాదాపు ఆర్థిక వ్యవస్థలు కొన్ని నిబంధనలతో తెరుచుకున్నాయి. ముఖ్యంగా దేశ స్థూల జాతియోత్పత్తిలో దాదాపు 27 శాతం వాటా కలిగి ఉన్న ఐదు రాష్ట్రాలు ప్రపంచంలోని అతిపెద్ద లాక్ డౌన్ నుండి నెమ్మదిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రాలు తెరుచుకోవడం భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు శుభసూచకమని ఎలారా సెక్యూరిటీస్ ఇంక్ స్టడీలో తేలింది.

భారత వృద్ధిపై ఆశ్చర్యం, చైనా బాటలో నడుస్తోందని...భారత వృద్ధిపై ఆశ్చర్యం, చైనా బాటలో నడుస్తోందని...

కీలక ఐదు రాష్ట్రాల్లో పుంజుకున్న కార్యకలాపాలు

కీలక ఐదు రాష్ట్రాల్లో పుంజుకున్న కార్యకలాపాలు

కేరళ, పంజాబ్, తమిళనాడు, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. విద్యుత్ వినియోగం, ట్రాఫిక్ మూవ్‌మెంట్, హోల్ సేల్ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల రాక, గూగుల్ మొబిలిటీ డేటా ఆధారంగా పుంజుకుంటున్నట్లు అర్థమవుతోందని పేర్కొంటున్నారు. కరోనా కేసులు గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్నందున ఆ రాష్ట్రాల్లో అప్పుడే పికప్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రభుత్వం ఇచ్చే అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీ ఇదే!

ప్రభుత్వం ఇచ్చే అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీ ఇదే!

కరోనా అదుపులో ఉన్న ప్రాంతాల్లో జూన్ 8వ తేదీ నుండి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ప్రార్థనాస్థలాలు తెరుచుకోవడానికి వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. లాక్ డౌన్‌ను దశలవారీగా ఎత్తివేస్తోంది. కేంద్రం ఇటీవల రూ.21 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వం ఇచ్చేదే అతిపెద్ద, అతిముఖ్యమైన ఆర్థిక ప్యాకేజీ అని ఎలారా సెక్యూరిటీస్ ఇంక్ ఎనకమిస్ట్ గరిమా కపూర్ చెప్పారు. అంటే ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైతే అంతకుమించిన ప్యాకేజీ లేదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నప్పటికీ, ఇంకా పుంజుకోవాలన్నారు.

విద్యుత్ డిమాండ్

విద్యుత్ డిమాండ్

వ్యవసాయ కార్యకలాపాల నుండి వచ్చిన డిమాండ్ మేరకు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు విద్యుత్‌ను మెరుగుపరిచాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. గూగుల్ సెర్చ్ పోకడలను పరిశీలిస్తే కన్స్యూమర్స్ కొత్త జీవన విధానానికి అనుగుణంగా వినియోగ విధానాలను మారుస్తున్నట్లుగా ఉందని తెలిపారు.

ఈ సేవలపై దృష్టి

ఈ సేవలపై దృష్టి

సెలూన్ సేవలు, ఎయిర్ కండిషనర్స్, ఎయిర్ ట్రావెల్, బైక్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్ వాషింగ్ మిషన్స్ కోసం డిమాండ్ పెరిగినట్లుగా గూగుల్ సెర్చ్ పోకడలు పరిశీలిస్తే అర్థమవుతోందని చెబుతున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన కొత్తలో భయంతో చాలామంది సోప్స్, గ్రాసరీ ఐటమ్స్, ఫార్మసీ ఐటమ్స్ కొనుగోలు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇయర్ ఫోన్స్, హెయిరాయిల్, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్స్, జ్యువెల్లరీ, మోప్స్, టాయ్స్, మైక్రోఓవెన్స్ వంటి వాటిని చూస్తున్నారు.

English summary

లాక్‌డౌన్ నుండి ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులా ఈ 5 రాష్ట్రాలు! అసలు ప్యాకేజీ 'మనీ' కాదు..! | These states are leading Indian economy to recovery from lockdown

Five Indian states contributing nearly 27% of the country’s gross domestic product are leading a recovery in the economy as it slowly emerges from the world’s biggest lockdown, a study by Elara Securities Inc. shows.
Story first published: Tuesday, June 2, 2020, 16:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X