For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

|

ప్రతి ఒక్కరు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ఇంటికి అన్ని తానై వ్యవహరించే వారు తప్పుకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎవరు ఊహించలేరు. అలాంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమ్మన్నారని ఏది పడితే తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏమిటంటే..

సరిపోని హామీ మొత్తం

సరిపోని హామీ మొత్తం

టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ బీమా తీసుకున్న తర్వాత వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. మరణించిన తర్వాత వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. అయితే సరైన మొత్తంలో బీమా చేసుకోవడం ముఖ్యం. తగినంత మొత్తంలో ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంటే మీ కుటుంబం ఆర్థిక అవసరాలను తీరవు. అందుకే తగిన మొత్తానికి పాలసీ తీసుకోవాలి.

సెటిల్‌మెంట్ నిష్పత్తి

సెటిల్‌మెంట్ నిష్పత్తి

టర్మ్ ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి, బీమా సంస్థ ఆర్థిక స్థితి తెలుసుకోవాలి. తక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ కే ఎక్కువ హామీ ఉంటుందని క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి ఉన్న బీమా సంస్థ వద్ద పాలసీ కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి.

చిన్న వయస్సులో పాలసీ

చిన్న వయస్సులో పాలసీ

వయస్సు పెరిగే కొద్ది మనకు రిస్క్ పెరుగుతుంది కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరిగుతుంది. అందుకే చిన్న వయస్సు నుంచే పాలసీ తీసుకోవడం మంచిది. మీరు 25 సంవత్సరాల వయస్సులో రూ. 50 లక్షల విలువైన టర్మ్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే, ప్రీమియం మొత్తం సంవత్సరానికి రూ. 5000 వరకు ఉంటుంది. అయితే, మీరు 35 ఏళ్ల వయస్సులో అదే ప్లాన్‌ను పొందినట్లయితే, ప్రీమియం మొత్తం దాదాపు రూ. 9000 అవుతుంది.

తప్పుడు సమాచారం

తప్పుడు సమాచారం

పాలసీ తీసుకునేటప్పుడు సమాచారాన్ని దాచడం లేదా తప్పు సమాచారాన్ని అందించడం అనేది వ్యక్తులు చేసే అత్యంత ప్రాథమిక తప్పులలో ఒకటి. మీ వైద్య చరిత్ర, ఆర్థిక స్థితి మొదలైన వాటి గురించిన వివరాలు మీ బీమా సంస్థకు విలువైన సమాచారం, ఇది మీ కేసును అంచనా వేయడంలో వారికి సహాయపడుతుంది. మీరు తప్పుడు సమాచారం ఇస్తే మీ క్లెయిమ్ రిజక్ట్ అవుతంది.

పన్ను ఆదా కోసం

పన్ను ఆదా కోసం

జీవిత బీమా పాలసీలు పన్ను ఆదా ప్రయోజనాలను పొందేందుకు ఒక గొప్ప మార్గం అన్నది నిజమే అయినప్పటికీ, జీవిత బీమా పొందడం ఒక్కటే ఉద్దేశ్యం కాకూడదు. జీవిత బీమా పాలసీలు రూ. 1.5 లక్షల వరకు పొదుపు ప్రయోజనాలను అందించవచ్చని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ నిర్దేశిస్తుంది. అంతేకాకుండా, మెచ్యూరిటీ లేదా పాలసీదారు మరణించిన సందర్భంలో పొందే ఏవైనా బోనస్‌లు లేదా పాలసీలు పన్ను నుంచి మినహాయించబడతాయని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(10D) చెబుతోంది. ఆలాగని పన్ను ఆదా కోసం మాత్రమే పాలసీ తీసుకోకూడదు.

English summary

Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి.. | There are several things that everyone should know before taking term insurance

It is important for everyone to take term life insurance. Especially those who take care of the house all by themselves should definitely take term insurance.
Story first published: Saturday, November 26, 2022, 12:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X