For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు, త్వరలో శాలరీ పెంపు!

|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల పీఆర్సీ అమలు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పది, పన్నెండు రోజుల్లో ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని పే రివిజన్ కమిషన్ (PRC)ను ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగుల వేతనాల పెంపు కోసం 2018లో పీఆర్సీని నియమించింది. అప్పటి నుంచి వేతనాల పెంపుపై వేతన సవరణ సంఘం అధ్యయనం చేస్తోంది. 2018 జూన్ 1వ తేదీ నుంచి పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తాజా ఆదేశాల నేపథ్యంలో ఉద్యోగులకు వేతన వరం లభించే అవకాశముంది.

ఏపీ, తెలంగాణ మెడికల్ డివైసెస్ పార్కులకు కేంద్రం అనుమతిఏపీ, తెలంగాణ మెడికల్ డివైసెస్ పార్కులకు కేంద్రం అనుమతి

నాడు 43% ఫిట్మెంట్

నాడు 43% ఫిట్మెంట్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కోసం పది పన్నెండు రోజుల్లో నివేదికను సమర్పించాలని సీఎం కేసీఆర్ పీఆర్సీని ఆదివారం ఆదేశించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్‌తో 2015 ఫిబ్రవరి ఐదో తేదీన వేతన సవరణను కేసీఆర్ ప్రకటించారు. 2014 జూన్ మొదటి తేదీ నుంచి అమలులోకి వచ్చింది. పీఆర్సీ గడువు 2019 జూన్ 30న ముగిసింది. జూలై 1వ తేదీ నుంచి వేతన సవరణ జరగాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మే 22న పీఆర్సీని నియమించింది.

మధ్యంతర భృతికి నో.. పీఆర్సీయే...

మధ్యంతర భృతికి నో.. పీఆర్సీయే...

తొలి మూడు నెలల్లోనే పీఆర్సీని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు నివేదిక అందలేదు. పీఆర్సీ నివేదిక ఆలస్యమవుతోందని, రాష్ట్ర అవతరణ దినోత్సవం కానుకగా ఉద్యోగులకు 2018 జూన్ 2న మధ్యంతర భృతి ప్రకటిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి, ఆ తర్వాత వెనక్కి తగ్గారు. మధ్యంతర భృతి కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల సంఘాలు కోరుకున్నప్పటికీ నేరుగా కొత్త వేతన సవరణకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారట. దీంతో పీఆర్సీ నివేదికను కోరినట్లుగా తెలుస్తోంది.

ఎంత పెంచింతే రాష్ట్రంపై ఎంత భారం...!

ఎంత పెంచింతే రాష్ట్రంపై ఎంత భారం...!

ప్రభుత్వ అధ్యయనాలు పూర్తయ్యాయి. తెలంగాణలో మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రెండు లక్షలమందికి పైగా పెన్షన్ దారులు ఉన్నారు. వేతన సవరణ ద్వారా ఎంత పెంచితే ప్రభుత్వంపై ఎంత ఆదాయం అవుతుందో ఆర్థిక శాఖ ఇప్పటికే నివేదించింది.

తీపి కబురు ఎప్పుడో?

తీపి కబురు ఎప్పుడో?

పీఆర్సీ నివేదిక వస్తే, దానిపై ప్రభుత్వం ఉపసంఘం లేదా ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత పీఆర్సీ నిర్ణయం కొత్త ఏడాది లేదా సంక్రాంతి కానుకగా వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లేదా వెంటనే నిర్ణయం తీసుకోవాలని కేసీఆఱ్ భావిస్తో తీపి కబురు కూడా త్వరలో అందవచ్చునని తెలుస్తోంది.

English summary

తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు, త్వరలో శాలరీ పెంపు! | Telangana Government orders PRC commission to submit report

The Telangana State government has directed the Pay Revision Commission (PRC) for government staff, the first pay revision body constituted after the formation of Telangana State, to submit its report within 10 to 12 days.
Story first published: Monday, November 11, 2019, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X