For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Telangana Budget: దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఎక్కువ

|

హైదరాబాద్: 2020-21 సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.1,42,152.28 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,10,824.77 కోట్లు. మూలధన వ్యయం రూ.13,162.72 కోట్లు. రెవెన్యూ ఖాతా మిగులు రూ.103.55 కోట్లు. రూ.1,82,914 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో... రాష్ట్ర వృద్ధి రేటు గత ఏడాది నుండి తగ్గుతోంది. కేంద్రం నుండి వచ్చే నిధులు తగ్గుతున్నాయి. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే జీఎస్టీ నిధులు సకాలంలో రావట్లేదు. గత ఏడాది రెవెన్యూ వృద్ధి రేటు 16 శాతం నుండి 6 శాతానికి తగ్గింది.

కస్టమర్లకు రిలయన్స్ జియో మరోసారి భారీ షాక్, త్వరలో టారిఫ్ పెంపు!కస్టమర్లకు రిలయన్స్ జియో మరోసారి భారీ షాక్, త్వరలో టారిఫ్ పెంపు!

Telangana Budget: TS per capita more than national per capita

దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. రైతు బంధు పథకాన్ని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. కేంద్రం కూడా దీనిని అమలు చేస్తోంది. రైతు బంధు పథకానికి రూ.12వేల కోట్ల రూపాయలు. రైతు బంధు పథకం లబ్ధిదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

రైతు బీమాకు రూ.1,141 కోట్లు, రైతు బీమా కింద రూ.5 లక్షలు. 25వేల లోపు రుణాలు ఉన్న రైతులందరికీ ఒకే విడతలో రుణమాఫీ. రైతులకు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు. రైతు రుణమాఫీ కోసం రూ.6225 కోట్లు. గోడౌన్ల సామర్థ్యం పెంచాం.

English summary

Telangana Budget: దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఎక్కువ | Telangana Budget: TS per capita more than national per capita

The Telangana Budget for 2020-21 presented on March 8, the third day of the 12 day Budget sessions that will end on March 20.
Story first published: Sunday, March 8, 2020, 11:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X