For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IBMతో కలిసి పని చేయనున్న టెక్ దిగ్గజం TCS, ఎందుకంటే

|

దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఐబీఎంలు కలిసి పని చేయనున్నాయి. తమ క్లయింట్స్‌కు మెరుగైన సేవుల అందించేందుకు ఈ నిర్ణయానికి వచ్చాయి. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్స్‌కు అత్యాధునిక టెక్నాలజీని అందించేందుకు ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. ఇందులో భాగంగా అత్యుత్తమ టెక్నాలజీతో ఐబీఎం క్లౌడ్ యూనిట్‌ను టీసీఎస్ ప్రారంభిస్తుంది. ఇందులో టీసీఎస్, ఐబీఎంలకు చెందిన టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. క్లయింట్స్‌కు, వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఈ కలయిక ఉపయోగపడుతుందని ఐటీ విశ్లేషకులు చెబుతున్నారు.

అలా చేస్తే పక్షపాతమే: అంగీకరించిన సుందర్ పిచాయ్, గూగుల్ కీలక నిర్ణయంఅలా చేస్తే పక్షపాతమే: అంగీకరించిన సుందర్ పిచాయ్, గూగుల్ కీలక నిర్ణయం

డేటా ఎస్టేట్, అనలిటిక్స్, వివిధ రకాల అప్లికేషన్స్ తదితర అంశాల్ని బదలీ చేయనున్నట్లు ఈ రెండు కంపెనీలు తెలిపాయి. భవిష్యత్తులో తమ క్లయింట్స్, వినియోగదారులకు వేగంగా సేవలు అందించేందుకు టీసీఎస్, ఐబీఎం ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని టీసీఎస్‌కు చెందిన వెంకట్రామన్ చెప్పారు. క్లౌడ్ టెక్నాలజీ బదలీ వల్ల క్లయింట్స్‌కు వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బోబ్ లార్డ్ అన్నారు. ఈ ఒప్పందంతో ఐటీ వేగంగా వృద్ధి చెందుతుందన్నారు.

 TCS, IBM tie up to drive digital and cognitive enterprise transformations

గతంలో డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ సంస్థలు గూగుల్‌ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజుర్, ఐబీఎం క్లౌడ్, అమెజాన్ వెబ్ సిరీస్ వంటి టెక్ దిగ్గజాలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

English summary

IBMతో కలిసి పని చేయనున్న టెక్ దిగ్గజం TCS, ఎందుకంటే | TCS, IBM tie up to drive digital and cognitive enterprise transformations

Information technology giant, Tata Consultancy Services (TCS) Ltd, and IBM have expanded their global partnership to help clients accelerate their digital transformations to IBM public cloud using IBM Cloud Paks.
Story first published: Friday, June 19, 2020, 20:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X