For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1200 శాతం మధ్యంతర డివిడెండ్ ఇచ్చిన టీసీఎస్

|

ఇండియాలో అతిపెద్ద సాఫ్టువేర్ ఎగుమతుల సంస్థ టాటా కన్సల్టెన్సీ (TCS) ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12 మధ్యంతర డివిడెండ్ అందించింది. మంగళవారం సమావేశమైన బోర్డు.. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.12 లేదా 1200 శాతం మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడానికి పచ్చజెండా ఊపింది.

ఈ నెల 24వ తేదీ నుంచి ఇందుకు సంబంధించి చెల్లింపులు జరపనున్నట్లు బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. 12 శాతం డివిడెండ్ అంటే రూ.4,503 కోట్లు అవుతుంది. ఇండియాలో టాప్ టెక్ కంపెనీ అయిన టీసీఎస్‌లో టాటా సన్స్ వాటా 72 శాతంగా ఉంది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌తో కలుపుకుంటే డివిడెండ్ అమౌంట్ రూ.5,400 కోట్లు అవుతుంది.

<strong>నెల రోజుల్లోనే రెండోసారి: 140 శాతం టీవీఎస్ మధ్యంతర డివిడెండ్</strong>నెల రోజుల్లోనే రెండోసారి: 140 శాతం టీవీఎస్ మధ్యంతర డివిడెండ్

TCS declares Rs 12 a share interim dividend

గత మూడేళ్ల కాలంలో టీసీఎస్ రూ.30,089 కోట్ల డివిడెండ్‌ను ఇచ్చింది. గత అయిదేళ్లలో రూ.54,133 కోట్ల డివిడెండ్ అందించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ ప్రాఫిట్ రూ.31,472 కోట్లుగా ఉంది. కాగా, టాటా గ్రూప్‌లోని 11 మేజర్ కంపెనీల డెబిట్స్ (ఫైనాన్షియల్ కంపెనీలు మినహాయిస్తే) 2018లో రూ.2.22 లక్షల కోట్లు కాగా, 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.2.46 లక్షల కోట్లుగా ఉంది.

English summary

1200 శాతం మధ్యంతర డివిడెండ్ ఇచ్చిన టీసీఎస్ | TCS declares Rs 12 a share interim dividend

Tata Consultancy Services declared an interim dividend of Rs 12 per equity share amounting to Rs 4,503 crore on Tuesday, in a bonanza for shareholders, chiefly parent company Tata Sons which holds about 72 per cent stake in India’s top tech services provider.
Story first published: Wednesday, March 11, 2020, 15:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X