For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా మోటార్స్‌కు కరోనా దెబ్బ, JLRలో 1,100 ఉద్యోగాల కోత: చైనాలో కోలుకుంటోంది..

|

గత ఆర్థిక సంవత్సరంలో మందగమనంకు తోడు కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బతీయడంతో టాటా మోటార్స్ లిమిటెడ్, బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సేల్స్ కుప్పకూలి, భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2019-20 చివరి క్వార్టర్‌లో (జనవరి - మార్చి) జాగ్వార్ ల్యాండ్ రోవర్స్ టాటా మోటార్స్ నష్టాలను ఎక్కువగా ప్రభావితం చేసింది. చైనా, యూరోప్ వంటి కీలక మార్కెట్ దేశాలు లాక్ డౌన్‌లోకి వెళ్లాయి. సరఫరా గొలుసుకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో JLR ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది.

టాటా మోటార్స్ నష్టం రూ.9,894 కోట్లు, భారీగా దెబ్బతీసిన జాగ్వార్ ల్యాండ్ రోవర్టాటా మోటార్స్ నష్టం రూ.9,894 కోట్లు, భారీగా దెబ్బతీసిన జాగ్వార్ ల్యాండ్ రోవర్

కాస్ట్ కట్టింగ్ ద్వారా 1.26 బిలియన్ డాలర్లు ఆదా

కాస్ట్ కట్టింగ్ ద్వారా 1.26 బిలియన్ డాలర్లు ఆదా

కరోనా మహమ్మారి కారణంగా బిజినెస్ దెబ్బతినడంతో 1,000 నుండి 1,100 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రభావం JLR టెంపరరీ ఉద్యోగులపై పడనుంది. ఈ ఉద్యోగాల కోత ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1 బిలియన్ పౌండ్లు లేదా 1.26 బిలియన్ డాలర్లు కాస్ట్ కట్టింగ్ ద్వారా ఆదా చేసే అవకాశముందని టాటా మోటార్స్ భావిస్తోంది.

మార్చి 2021 నాటికి 5 బిలియన్ పౌండ్లు

మార్చి 2021 నాటికి 5 బిలియన్ పౌండ్లు

మార్చి 2021 నాటికి జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూనిట్ ద్వారా 5 బిలియన్ పౌండ్లు ఆదా చేయాలని భావిస్తోంది టాటా మోటార్స్. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ సోమవారం తెలిపారు. ఇప్పటికే 3.5 బిలియన్ పౌండ్స్ పొదుపు సాధించామన్నారు. ఉద్యోగాల కోత ద్వారా 1 బిలియన్ పౌండ్స్ సేవ్ చేయనున్నారు.

ఇలా ఖర్చులు తగ్గిస్తాం

ఇలా ఖర్చులు తగ్గిస్తాం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలతధన వ్యయం 2.5 బిలియన్ పౌండ్లకు తగ్గిస్తామని, ఇది గత ఏడాది 3 బిలియన్ పౌండ్స్‌గా ఉందని చెప్పారు. నగదు పరిరక్షణ, మూలధన వ్యయానికి ప్రాధాన్యత, పెట్టుబడికి సరైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి వివిధ మార్గాల ద్వారా ఖర్చులు తగ్గించుకుంటామని తెలిపారు. కాస్ట్ కట్టింగ్‌లో భాగగా దాదాపు 1100 మంది ఉద్యోగులపై ప్రభావం పడవచ్చునని జేఎల్ఆర్ అధికార ప్రతినిధి చెప్పారు.

వ్యాపారాల సమీక్ష

వ్యాపారాల సమీక్ష

టాటా మోటార్స్ తన వ్యాపారాలన్నింటినీ సమీక్షిస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వ్యాపారంలో రూ.6,000కోట్లను ఆదా చేసే విస్తృత ప్రయత్నంలో భాగంగా వ్యూహాత్మక వ్యాల్యూను జోడించని వాటి నుండి నిష్క్రమించే ఆలోచన కూడా చేస్తోంది. గత జనవరి - మార్చి క్వార్టర్‌లో ఆపరేషన్స్ రెవెన్యూ రికార్డ్ స్థాయిలో 27.7 శాతం నష్టపోయి రూ.62,493కు పడిపోయింది. టాటా మోటార్స్‌లో సాధారణంగా ఎక్కువ భాగం ఆదాయం జాగ్వార్ ల్యాండ్ రోవర్స్ ద్వారా ఉంటుంది. కానీ ఈసారి ఏకంగా 501 మిలియన్ పౌండ్స్ (ట్యాక్స్‌కు ముందు నష్టం)గా ఉంది.

కోలుకుంటున్న సంకేతాలు

కోలుకుంటున్న సంకేతాలు

కరోనా మహమ్మారి అనంతరం JLRకు అతిపెద్ద మార్కెట్ అయిన చైనా, అమెరికా, ఐరోపాలో అమ్మకాలు కోలుకుంటున్న సంకేతాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ల్యాండ్ రోవర్స్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ డిఫెండర్, రేంజ్ రోవర్స్ ఎవోక్‌కు మంచి ఆర్డర్స్ ఉన్నట్లు తెలిపారు. మరోవైపు 2010 నుండి కొనసాగుతున్న జేఎల్ఆర్ బాస్ రాల్ఫ్ స్పెత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో పదవి నుండి తప్పుకుంటున్నారు. చైనాలో, వాహన అమ్మకాల్లో కోలుకుంటున్నామని, కస్టమర్లు తిరిగి షోరూమ్స్‌కు వస్తున్నారని రాల్ఫ్ స్పెత్ చెప్పారు.

English summary

టాటా మోటార్స్‌కు కరోనా దెబ్బ, JLRలో 1,100 ఉద్యోగాల కోత: చైనాలో కోలుకుంటోంది.. | Tata Motors to shed 1,100 JLR jobs after pandemic hits earnings

Tata Motors Ltd expects to shed about 1,100 temporary jobs at Jaguar Land Rover after it raised the cost-cutting target at its luxury unit by 1 billion pounds ($1.26 billion) to ride out the disruptions caused by the coronavirus outbreak.
Story first published: Tuesday, June 16, 2020, 8:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X