For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, అదరగొట్టిన టాటా మోటార్స్: కరోనా సోషల్ డిస్టెన్స్ కలిసొచ్చిందా?

|

ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ వాహన విక్రయాలు ఆగస్ట్ నెలలో కాస్త పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ సేల్స్ కూడా గత నెలలో 13 శాతం మేర వృద్ధి సాధించాయి. ఆగస్ట్ నెలలో మొత్తం 36,472 వాహన విక్రయాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలోని సేల్స్ 32,166తో పోలిస్తే 13.38 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. దేశీయ విక్రయాలు 29,140 యూనిట్ల నుండి 21.6 శాతం పెరిగి 35,420గా నమోదయ్యాయి. దేశీయ ప్యాసింజర్ సేల్స్ 7,316 నుండి రెండింతల కంటే ఎక్కువ పెరిగి 18,583కు చేరుకున్నాయి.

59% తిరస్కరణ: రెండేళ్లలో డబుల్.. అమెరికన్లకు ఇన్ఫోసిస్ కీలక ప్రకటన59% తిరస్కరణ: రెండేళ్లలో డబుల్.. అమెరికన్లకు ఇన్ఫోసిస్ కీలక ప్రకటన

అదరగొట్టిన టాటా మోటార్స్

అదరగొట్టిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ కనిష్టాన్ని తాకాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి కరోనా దెబ్బ పడింది. కానీ క్రమంగా పుంజుకుంటున్నాయి. టియాగో, నెక్సాన్ తయారీదారు అయినా టాటా మోటార్స్ ఆగస్ట్ సేల్స్ రెండేళ్ల గరిష్టాన్ని నమోదు చేశాయి. ప్యాసింజర్ సేల్స్ గత ఏడాది ఆగస్ట్ నెలలో 7,316 ఉండగా, ఈసారి 18,580కి పెరిగాయి. 154 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ వాహనాలు మార్చి 2018లో 20,266 యూనిట్లతో రికార్డ్ సేల్స్ నమోదయ్యాయి.కమర్షియల్ వెహికిల్ సేల్స్‌లో మాత్రం 28 శాతం క్షీణతను నమోదు చేసింది. గత ఏడాది 24,850 యూనిట్లు కాగా, ఈసారి 17,889కు పరిమితమయ్యాయి.

హారియర్, నెక్సాన్ సేల్స్ పెరిగాయి

హారియర్, నెక్సాన్ సేల్స్ పెరిగాయి

గత కొద్ది నెలలుగా అంతగా లేని బిజినెస్ ఇప్పుడు క్రమంగా కోలుకుంటుందని టాటా మోటార్స్ పీవీ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర అన్నారు. అన్ని మోడల్స్ పరంగా వృద్ధిని సాధించినట్లు తెలిపారు. జనవరిలో ప్రారంభించిన అన్ని మోడల్స్ ఆకట్టుకుంటున్నాయన్నారు. నెక్సాన్, టియాగో, హారియర్, టైగోర్‌లకు తోడు ఆల్ట్రోజ్‌ను జత చేసినట్లు తెలిపారు. హారియర్, నెక్సాన్ సేల్స్ వరుసగా 40 శాతం, 43 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

అందుకే సేల్స్ పెరిగాయా?

అందుకే సేల్స్ పెరిగాయా?

కరోనా మహమ్మారి కారణంగా అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధానంగా సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ఆటో సేల్స్ పెరుగుతుండవచ్చునని చెబుతున్నారు. గత ఏడాది మందగమనం కారణంగా సేల్స్ పడిపోయాయి. కానీ అప్పటి కంటే ఈ కరోనా సమయంలో పెరగడం గమనారం. ఇందుకు సోషల్ డిస్టెన్స్ అంశం కూడా ముఖ్యమేనని అంటున్నారు. ఇతర కంపెనీల వాహన విక్రయాలు కూడా ఆగస్ట్ నెలలో పెరిగాయి. క్రమంగా రికవరీ ప్రారంభం కావడంతో సోషల్ డిస్టెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. ఆటో రంగం నిపుణులు కూడా గతంలోనే ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సోషల్ డిస్టెన్స్ నేపథ్యంలో వాహన విక్రయాలు కొంతకాలం పెరుగుతాయని భావించారు.

English summary

గుడ్‌న్యూస్, అదరగొట్టిన టాటా మోటార్స్: కరోనా సోషల్ డిస్టెన్స్ కలిసొచ్చిందా? | Tata Motors reports 13 percent increase in sales in August

Passenger vehicle (PV) sales at Tata Motors are picking up pace after touching a historical low in FY20. The maker of Tiago and Nexon saw dispatches race to a two-year high in August.
Story first published: Friday, September 4, 2020, 18:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X