For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tata Ace EV: వాణిజ్య అవసరాల కోసమూ కరెంటు బండ్లు

|

ముంబై: దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ మరో ముందడుగు వేసింది. వాణిజ్య అవసరాల కోసం ఎలక్ట్రిక్ వెహికల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా ఏస్ ఈవీ కమర్షియల్ వెహికల్‌ను ఆవిష్కరించింది. ఇప్పటిదాక డీజిల్‌ వేరియంట్‌లో ఉన్నటాటా ఏస్ వాహనాన్ని ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో కూడా ప్రవేశపెట్టింది. టాటా మోటార్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ఈ వెహికల్‌ను ఆవిష్కరించారు. త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

కార్పొరేట్‌ సెక్టార్‌లో కీలక పరిణామం: ఆ రెండు బిగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీల విలీనంకార్పొరేట్‌ సెక్టార్‌లో కీలక పరిణామం: ఆ రెండు బిగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీల విలీనం

టాటా మోటార్స్ తొలిసారిగా 2005లో ఏస్ కమర్షియల్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో ఆ వేరియంట్ ఓ సంచలనం. చిన్నతరహా వ్యాపారస్థులు దీన్ని విస్తృతంగా వినియోగించుకుంటూ వచ్చారు. టాటా ఏస్ మార్కెట్లోకి వచ్చి 17 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఎలక్ట్రిక్ వర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిి ఇవోజెన్ ఈవీ అని పేరుపెట్టింది. పవర్‌ట్రైన్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పని చేస్తుందీ వెహికల్. 36.2 బీహెచ్‌పీని ప్రొడ్యూస్ చేస్తుంది. 130 ఎన్ఎమ్ టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tata Motors launched Ace EV With Range Of 154 Kmph as small commercial vehicle

లిక్విడ్-కూల్డ్ ఐపీ67 సర్టిఫైడ్ లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చింది కంపెనీ. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ బ్యాటరీ. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 154 కిలోమీటర్ల రేంజ్‌ను అందుకుంటుంది. ఈ వెహికల్ పొడవు-3,800, వెడల్పు-1,500, ఎత్తు-2,635 మిల్లీ మీటర్లు. వీల్‌బేస్ 2,100 మిల్లీమీటర్లు. టర్నింగ్ రేడియస్ 4.3 మీటర్లు. ఈ వాహనం మొత్తం బరువు 1,840 కిలోలు. 600 కిలోల వరకూ పేలోడ్‌ను మోయగలదు. కార్గో అవసరాలను తీర్చడానికి అనుకూలంగా దీన్ని తీర్చిదిద్దింది టాటా మోటార్స్.

Tata Motors launched Ace EV With Range Of 154 Kmph as small commercial vehicle

టాటా మోటార్స్ సుమారు 39,000 యూనిట్ల సరికొత్త టాటా ఏస్ ఎలక్ట్రిక్ వాహనాలను తొలిదశలో తయారు చేయనుంది. వాటిని అమెజాన్, బిగ్‌బాస్కెట్, సిటీలింక్, డాట్, ఫ్లిప్‌కార్ట్, లెట్స్ ట్రాన్స్‌పోర్ట్, మూవింగ్, ఎలో ఈవీ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, లాజిస్టిక్ చైన్ కంపెనీలకు అందించనుంది. భవిష్యత్‌లో విస్తృతంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ వెహికల్ ప్రారంభ ధర 4 లక్షల నుంచి 5.5 లక్షల రూపాయల వరకు నిర్ధారించారు. 6.6 లక్షల రూపాయల వరకు వెళ్లొచ్చు.

Tata Motors launched Ace EV With Range Of 154 Kmph as small commercial vehicle

English summary

Tata Ace EV: వాణిజ్య అవసరాల కోసమూ కరెంటు బండ్లు | Tata Motors launched Ace EV With Range Of 154 Kmph as small commercial vehicle

Tata Motors has not announced the price of the all-electric small commercial vehicle yet but given that the current range begins at Rs. 4 lakh and goes up to Rs. 5.50 lakh.
Story first published: Friday, May 6, 2022, 18:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X