For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Raksha Bandhan: స్వీట్స్ బిజినెస్ రూ.5,000 కోట్లు ఢమాల్! తగ్గిన గిఫ్ట్స్ కొనుగోళ్లు

|

రక్షాబంధన్ పండుగ రోజున సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది. రాఖీ పండుగ సమయంలో రక్షను కట్టడంతో పాటు నోరును తీపి చేయడం సంప్రదాయం. స్వీట్స్/మిఠాయిలకు కూడా యమ గిరాకీ ఉంటుంది. రాఖీపౌర్ణమి రోజున స్వీట్స్ పరిశ్రమ అధిక డిమాండ్ కారణంగా కస్టమర్లతో కళకళలాడుతుంది. కానీ ఈసారి కరోనా మహమ్మారి స్వీట్ వ్యాపారాన్ని భారీగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఐటీ కంపెనీల్లో 90 రోజుల్లో 11,000 మంది ఉద్యోగులు ఔట్!ఐటీ కంపెనీల్లో 90 రోజుల్లో 11,000 మంది ఉద్యోగులు ఔట్!

రూ.5,000 కోట్ల వ్యాపార నష్టం

రూ.5,000 కోట్ల వ్యాపార నష్టం

రాఖీ పౌర్ణమి సమయంలో దేశవ్యాప్తంగా రూ.10,000 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. అయితే కరోనా కారణంగా ఈసారి ఇది సగానికి పడిపోతుందని స్వీట్ ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. వ్యాపారం ఈసారి రూ.5,000 కోట్లకు పడిపోవచ్చునని పెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నమ్‌కీన్ మ్యానుఫ్యాక్చరర్స్ డైరెక్టర్ అన్నారు. అంటే రూ.5,000 కోట్ల వ్యాపార నష్టం ఉండవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.

సందడి కరువు

సందడి కరువు

సాధారణంగా రక్షాబంధన్ ఒకటి రెండు రోజుల ముందు నుండి స్వీట్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. కానీ ఈసారి గతంలో వలె సందడి కనపిించలేదని చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలోని ముఖ్య నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, దీంతో సాధ్యమైనంత వరకు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారని, ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని చెబుతున్నారు.

ఆన్‌లై రాఖీ ఆర్డర్.. బహుమతుల పైనా ప్రభావం

ఆన్‌లై రాఖీ ఆర్డర్.. బహుమతుల పైనా ప్రభావం

కరోనా, సామాజిక దూరం కారణాలతో చాలామంది ప్రయాణాలను పక్కన పెట్టి ఆన్‌లైన్ లేదా ఇతర మార్గాల్లో సోదరుడి వద్దకు వెళ్లకుండానే రాఖీలను పంపించారు. ఆన్ లైన్ ఆర్డర్ ఇవ్వడం ద్వారా సోదరులకు రాఖీలు పంపించారని, ప్రతిగా బహుమతులు పంపే వ్యాపారం పైన కూడా కరోనా ప్రభావం పడిందని చెబుతున్నారు. కాగా, రక్షాబంధన్ నుండి జన్మాష్టమి వరకు దేశంలో స్వీట్స్ అమ్మకాలు ఉంటాయి. సేల్స్‌లో 25 శాతం రక్షా బంధన్ సమయంలోనే ఉంటాయి. ఇప్పుడు ఆశించిన బిజినెస్ లేకపోవడంతో ఆశలు జన్మాష్టమిపై ఉన్నాయి.

English summary

Raksha Bandhan: స్వీట్స్ బిజినెస్ రూ.5,000 కోట్లు ఢమాల్! తగ్గిన గిఫ్ట్స్ కొనుగోళ్లు | Sweets industry May incur RS 5,000 crore loss this Raksha Bandhan

The country's sweets industry would suffer an estimated financial loss of Rs 5,000 crore during this Raksha Bandhan festival due to the coronavirus pandemic, an industry association claimed.
Story first published: Monday, August 3, 2020, 10:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X