For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Blank Cheque: ఖాళీ చెక్కుల జారీ విషయంలో జాగ్రత్త .. సుప్రీంకోర్టు కీలక తీర్పు.. పూర్తి బాధ్యత వారిదేనట..

|

Blank Cheque: చెక్కుల విషయంలో అనేక చిక్కులు ఉంటాయి. దేశంలో నగదు వినియోగం తగ్గటం, ఎక్కువ మెుత్తంలో నగదు లావాదేవీలు చేసేందుకు చెక్కులు, ఇతర డిజిటల్ పద్ధతులను వినియోగించటం సర్వ సాధారణంగా మారింది. అయితే చెక్కుల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని మోసాలు సైతం పెరుగుతున్నాయి.

చెక్కుల విషయంలో వారే బాధ్యులు..

చెక్కుల విషయంలో వారే బాధ్యులు..

చెక్కుల విషయంలో పూర్తి బాధ్యత డ్రాయర్ దే అని సుప్రీం కోర్టు వెల్లడించింది. అంటే చెక్కులపై వివరాలను ఇతరులు పూరించినప్పటికీ(ఫిల్ చేస్తే) దాని పూర్తి బాధ్యత దానిపై సంతకం చేసి ఇచ్చిన వ్యక్తిదేనని సుప్రీం కోర్టు వెల్లడించింది. చెక్ బౌన్స్ కేసులో అప్పీల్‌ను అనుమతిస్తూ జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బోపన్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

చెక్కును నింపకపోయినా..

చెక్కును నింపకపోయినా..

చెక్కుపై సంతకం చేసిన వ్యక్తి చెక్కును నింపలేదని చేతివ్రాత నిపుణుడి నివేదికను అప్రతిష్టపాలు చేయలేమని కోర్టు పేర్కొంది.ఈ కేసులో నిందితుడు చెల్లింపుదారునికి సంతకం చేసిన బ్లాంక్ చెక్కును ఇచ్చినట్లు అంగీకరించాడు. మరియు వివరాలు అతని చేతిలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చేతివ్రాత నిపుణుడిని నిమగ్నం చేయడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతిని మంజూరు చేసింది.

రుజువు చేస్తే..

రుజువు చేస్తే..

చెక్కును అప్పును చెల్లించేందుకు అప్పు తీర్చేందుకు లేదా ఏదైనా చెల్లింపు కోసం ఇచ్చినట్లు డ్రాయర్ అంటే చెక్కు ఇచ్చిన వ్యక్తి రుజువు చేసుకోవలసి ఉంటుంది. లేని పక్షంలో దాని పూర్తి బాధ్యత అతనే తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి ఐదు రాష్ట్రాల్లో రిటైర్డ్ జడ్జితో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది.

NI చట్టం..

NI చట్టం..

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ (NI) కింద మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. ఇది సెప్టెంబర్ 1, 2022 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇటువంటి కేసుల్లో ఒకే వ్యక్తిపై, ఒకే ట్రాన్సాక్షన్ విషయంలోని కేసులను కలిపి దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించాలని సుప్రీం కోర్టు కోరింది.

English summary

Blank Cheque: ఖాళీ చెక్కుల జారీ విషయంలో జాగ్రత్త .. సుప్రీంకోర్టు కీలక తీర్పు.. పూర్తి బాధ్యత వారిదేనట.. | Supreme Court judgment over blank cheque in a case saying Responsibility of drawer

Your Cheque, Your Responsibility, Even If Someone Else Fills Details, Observes Supreme Court
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X