For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్‌తో తప్పని ఇబ్బందులు, లాగ్-ఇన్‌కు సమయం

|

ఆదాయ పన్ను శాఖ కొత్త వెబ్‌సైట్ వారం రోజుల క్రితం ప్రారంభమైంది. ఆరంభంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమస్యను పరిష్కరించాలని ట్వీట్ చేశారు. అయితే వారం రోజులు దాటినా ఈ కొత్త ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి.

ఈ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చి వారం రోజులు అయినా సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో ఎంతోమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లాగ్-ఇన్ కావడానికి కూడా సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటోందట. పన్ను రిటర్న్స్ దాఖలును మరింత సులభతరం చేసే ఉద్దేశ్యంతో జూన్ 7న కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చింది.

Some features yet not functional in New IT e filing portal, Continues to face glitches

ఈ కొత్త పోర్టల్ http://www.incometax.gov.in ను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మొదటిరోజు సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిర్మలా సీతారామన్ స్పందించడంతో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూస్తోన్న ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని తమ సంస్థ దీనిపై పని చేస్తోందని అప్పుడు చెప్పారు. ఇది జరిగి వారమైనా సాంకేతిక సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు లాగ్ఇన్‌కు సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోంది. దాదాపు 10 నుండి 15 నిమిషాలు పడుతోందట. ఈ-ప్రొసీడింగ్స్ విభాగంలోకి వెళ్తే కమింగ్ సూన్ అనే సందేశం వస్తోందని చెబుతున్నారు.

English summary

కొత్త ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్‌తో తప్పని ఇబ్బందులు, లాగ్-ఇన్‌కు సమయం | Some features yet not functional in New IT e filing portal, Continues to face glitches

The Income Tax Department's much publicised new e-filing portal went live, users continued to face technical glitches ranging from longer than usual logging time.
Story first published: Monday, June 14, 2021, 21:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X