For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త ఫోన్లు ఓకే... కొనుగోలుదారులు ఏంచేస్తున్నారంటే?

|

ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే... కొందరి వద్ద రెండు కూడా ఉంటున్నాయి. ఒక ఇంట్లో మూడు నాలుగు ఫోన్లు సర్వ సాధారణంగా మారిపోయాయి. మాట్లాడటానికే కాకుండా వివిధ రకాల ఆడియో, వీడియో కంటెంట్ కోసం మొబైల్ ఫోన్ల వాడకం పెరుగుతోంది. మొబైల్ యాప్ ల ద్వారా అనేక పనులు చక్క బెట్టుకుంటున్నాం. అందుకే ఫోన్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఫోన్ లేని రోజును ఊహించలేని పరిస్థితి. విభిన్న రకాల కస్టమర్ల బడ్జెట్ కు అనుగుణంగా కంపెనీలు మొబైల్ ఫోన్లను తెస్తూనే ఉన్నాయి.

ఈ మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నందువల్ల దేశ, విదేశీ కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. దేశీయంగానే ఫోన్లను ఉత్పత్తి చేస్తూ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. కొత్తగా ఫోన్లను కొనుగోలు చేసే వారితో పాటు పాత ఫోన్లను మార్చుకునే వారితో మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. అయితే ఈ మార్కెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందా? అమ్మకాల్లో ప్రతి సంవత్సరం వృద్ధి నమోదు అవుతుందా? అసలు వచ్చే ఏడాదిలో మార్కెట్ ఎలా ఉండబోతోందన్న దానిపై పలు రకాల అంచనాలు వెలువడుతున్నాయి. అవేమిటంటే...

కొత్త ఏడాదిలో సింగిల్ డిజిట్ వృద్ధి!

కొత్త ఏడాదిలో సింగిల్ డిజిట్ వృద్ధి!

* వచ్చే ఏడాదిలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు సింగిల్ డిజిట్ తో వృద్ధి చెందే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి.

* కొత్త మోడల్స్ వస్తున్నాయే తప్ప వాటిలో పెద్దగా కొత్తదనం ఉండటం లేదని వినియోగదారులు భావిస్తున్నారు. ఫోన్ల ధరలు కూడా ఉండటం వల్ల తరచుగా ఫోన్లను మార్చే వారి సంఖ్య తగ్గిపోతోంది.

* గత దసరా, దీపావళి పండగలకు అమ్మకాలు భారీ స్థాయిలో ఉంటాయని ఉహించి కంపెనీలు ఉత్పత్తి చేశాయని, ఇంకా ఆ నిల్వలు మార్కెట్లో ఉన్నాయని అంటున్నారు. వీటి అమ్మకాలు జరిగే వరకు దాదాపు ఏడాదిన్నర కాలం పట్టా వచ్చంటున్నారు.

ఫోన్ మార్చేందుకు ఎక్కువ కాలం

ఫోన్ మార్చేందుకు ఎక్కువ కాలం

* మనదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల ధోరణిలో ఒక్కోసారి చాలా భిన్నత్వం కనిపిస్తుంది. ఇంతకు ముందు మూడునాలుగు నెలలకు కూడా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే వారు ఉండేవారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు వారు పదిహేను నెలల వరకు కూడా కొంత ఫోనుకు మారని పరిస్థితి కనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల అమ్మకాలు తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. దీనివల్లనే అమ్మకాల్లో వృద్ధి జోరుగా సాగడం లేదని చెబుతున్నారు.

* చాలా మంది ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు మారుతున్నారు. అయితే వీరి మూలంగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో మరీ అంత వృద్ధి ఏమీ ఉండటం లేదట. వీరు కొనుగోలు చేసే ఫోన్ల వెల తక్కువ స్థాయిలోనే ఉంటుంది. వీటి వల్ల పెద్దగా మార్జిన్లు ఉండవని కంపెనీలు చెబుతున్నాయి.

ఇదీ మార్కెట్ తీరు..

ఇదీ మార్కెట్ తీరు..

* ఈ ఏడాదిలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో దాదాపు తొమ్మిది శాతం ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగేళ్ళ క్రితం అమ్మకాల్లో దాదాపు ముప్పై శాతం వృద్ధి నమోదయింది. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల 2016 సంవత్సరంలో అమ్మకాలు ఐదు శాతం క్షీణించాయి. తర్వాతి రెండేళ్ల కాలంలో అమ్మకాలు 14 శాతం పెరిగినట్టు ఐడీసీ ఇండియా గణాంకాల ద్వారా తెలుస్తోంది.

English summary

కొత్త ఫోన్లు ఓకే... కొనుగోలుదారులు ఏంచేస్తున్నారంటే? | Smart phone sales may impact in the next year

Industry experts are expecting that in the next year smart phone sales may come down due to lack of innovation and high prices. Many users are postponing their mobile purchases industry people said.
Story first published: Monday, December 23, 2019, 21:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X