భారత వృద్ధి రేటు 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మైనస్ 7.5 శాతంగా నమోదయింది. మొదటి త్రైమాసికంలో మైనస్ 23.9 శాతం క్షీణతతో పోలిస్తే కాస్త సానుకూలం. అంతేకాదు. ఆర్బీఐ సహా వివిధ సంస్థలు మైనస్ 9 శాతం నుండి మైనస్ 14 శాతం వరకు అంచనా వేయగా, సెప్టెంబర్‌లో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడంతో కాస్త పుంజుకుంది. దీంతో మైనస్ 7.5 శాతం నమోదయింది. రెండో త్రైమాసికంలో వృద్ధి క్షీణత ఊహించిన దాని కంటే తగ్గినప్పటికీ కరోనా మహమ్మారి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై మరిన్ని త్రైమాసికాలు ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ో

V షేప్ రికవరీ కొనసాగుతుందా
ఆర్థిక క్షీణత రేటు మందగించి.. కాస్త సానుకూలంగా కనిపిస్తోందని, కానీ అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. V షేప్ రికవరీ కనిపిస్తోందని ప్రభుత్వం చెబుతోందని, ఇది అలాగే కొనసాగుతుందా అనేది చూడాలని అంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు డిసెంబర్ 2017 త్రైమాసికం స్థాయికి చేరుకుంది. అంటే మూడేళ్ళ వృద్ధి క్షీణించిందని చెబుతున్నారు. అలాగే, భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవస్థీకృత రంగలోని ఆర్థిక కార్యకలాపాలపై ఆధారంగా ఉంటుంది. అసంఘటిత రంగానికి సంబంధించిన డేటా అందుబాటులో ఉండదు. ఈ నేపథ్యంలో క్యూ2లో నమోదయిన సంకోచం కంటే మరింతగా ఉండవచ్చు.

ప్రతికూలంగానే ఈ ఏడాది
2020-21 ఆర్థిక సంవత్సరం వరుస రెండు త్రైమాసికాల్లో అంటే మొదటి అర్ధ సంవత్సరంలో వృద్ధి రేటు మైనస్ 15.7 శాతంగా ఉందని చెప్పవచ్చు. మొదటి ఆరు నెలల్లో రెండంకెల ఆర్థిక సంకోచం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనం ఈ ఆర్థిక సంవత్సరాన్ని డబుల్ డిజిట్ ప్రతికూలతతో ముగించినా ఆశ్చర్యం లేదంటున్నారు. మూడో క్వార్టర్, నాలుగో క్వార్టర్ కూడా ప్రతికూలంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబుల్ డిజిట్ కాకపోయినా ప్రతికూలంగా ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావొచ్చు.

పునరుజ్జీవం
భారత ఆర్థిక వ్యవస్థలో V షేప్ అభివృద్ధి కనిపిస్తోందని వినియోగ ఆధారిత పరిశ్రమల నుండి వస్తున్న గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా కన్స్యూమర్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ నుండి ఈ సంకేతాలు ఉన్నాయని వెల్లడించింది. ముఖ్యంగా మూలధనం, మౌలిక సదుపాయాల వస్తువులకు సంబంధించి వినియోగం, పెట్టుబడి రెండింటిలోను బలమైన పునరుజ్జీవం కనిపిస్తోందని చెబుతున్నారు. భారత జీడీపీలో దీని వాటా 90 శాతంగా ఉంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications