For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SEBI: హోల్‌టైమ్ సభ్యుడి పదవీ కాలంపై కేంద్రం కీలక నిర్ణయం

|

ముంబై: సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) హోట్ టైమ్ మెంబర్ అనంత బారువా పదవీ కాలంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ఆర్థిక వ్యవహారాలు, షేర్ మార్కెట్ల పర్యవేక్షణ విభాగం ఈ మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. వాస్తవానికి- అనంత బారువా పదవీ కాలం ఈ ఏడాది జులై 31వ తేదీ నాటికి ముగియాల్సి ఉంది.

మూడేళ్లుగా ఆయన సెబిలో హోల్‌టైమ్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. 2018 జులైలో ఆయనను ఆ హోదాలో నియమించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. అప్పట్లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం- మూడేళ్ల అనంత బారువా పదవీ కాలం వచ్చేనెల 31వ తేదీ నాటికి ముగియాల్సి ఉంది. ఆయన సేవలను మరికొంతకాలం పాటు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో- ఇంకో రెండేళ్ల పాటు పదవీ కాలాన్ని పొడిగించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఆయన 2023 జులై 31వ తేదీ వరకు అదే సెబి హోల్‌టైమ్ మెంబర్‌గా కొనసాగుతారు.

SEBI Whole-time Member Ananta Barua gets 2 year extension

హోల్‌టైమ్ సభ్యుడిగా నియమితుడు కావడానికి ముందు అనంత బారువా.. సెబి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1992 నుంచీ ఆయన సెబితో అసోసియేట్ అయి ఉంటోన్నారు. సెక్యూరిటీస్ మార్కెట్‌లో కొత్త మార్గదర్శకాలు, విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్రను పోషించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అనంత బారువా సేవలను మరికొంతకాలం వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ కారణంతోనే ఆయన పదవీకాలాన్ని పొడిగించినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి.

English summary

SEBI: హోల్‌టైమ్ సభ్యుడి పదవీ కాలంపై కేంద్రం కీలక నిర్ణయం | SEBI Whole-time Member Ananta Barua gets 2 year extension

The Centre has extended the tenure of appointment of Ananta Barua as Whole-time Member (WTM) of the Securities and Exchange Board of India (SEBI) for a period of two years beyond July 31.
Story first published: Saturday, June 19, 2021, 16:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X