For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.2,000 నోట్ల 'వ్యాల్యూ' క్రమంగా తగ్గింది, నకిలీ నోట్లు ఎన్ని అంటే!

|

2016లో నోట్ల రద్దు అనంతరం రూ.2,000 నోట్లు చలామణిలోకి వచ్చాయి. ప్రధానంగా అవినీతిని తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగా నాడు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు కొనసాగింపుగా రూ.2,000 నోటును రద్దు చేయకపోయినప్పటికీ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. రూ.2వేల నోట్ల చలామణి క్రమంగా తగ్గుతోందని కేంద్ర బ్యాంకు తాజా నివేదిక వెల్లడిస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2,000 నోటు ముద్రించలేదని మంగళవారం తెలిపింది. 2018 నుండి ఈ నోట్ల చలామణి క్రమంగా తగ్గిందని పేర్కొంది.

<strong>GST: ప్రజలపై పన్ను భారం తగ్గింది, ప్రభుత్వానికి రూ.1 లక్ష కోట్ల నష్టం</strong>GST: ప్రజలపై పన్ను భారం తగ్గింది, ప్రభుత్వానికి రూ.1 లక్ష కోట్ల నష్టం

మూడేళ్లలో ఎంత తగ్గిందంటే..

మూడేళ్లలో ఎంత తగ్గిందంటే..

2018 తర్వాత నుండి రూ.500, రూ.200 నోట్ల చలామణి గణనీయంగా పెరిగినట్లు ఆర్బీఐ నివేదిక తెలిపింది. రూ.2,000 నోట్ల చలామణి తగ్గిందని తెలిపింది. 2018 మార్చి చివరి నాటికి 33,632 లక్షల రూ.2000 కరెన్సీ నోట్లు (సంఖ్యాపరంగా) చలామణిలో ఉండగా, 2019 మార్చి చివరి నాటికి 32,910 లక్షలకు తగ్గినట్లు తెలిపింది. 2020 మార్చి చివరి నాటికి మరింతగా తగ్గి 27,398కు పరిమితమైనట్లు వెల్లడించింది.

రూ.2000 నోట్ల 'వ్యాల్యూ' ఇలా తగ్గింది!

రూ.2000 నోట్ల 'వ్యాల్యూ' ఇలా తగ్గింది!

కరెన్సీ నోట్ల వ్యాల్యూలో 2020 నాటికి రూ.2,000 నోట్లు 2.4 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. 2019 మార్చి చివరి నాటికి ఇది 3 శాతం కాగా, 2018 మార్చి చివరి నాటికి 3.3 శాతంగా ఉంది. వ్యాల్యూపరంగా 2018 మార్చి చివరి నాటికి 37.3 శాతం, 2019 మార్చి చివరి నాటికి 31.2 శాతం ఉండగా, 2020 మార్చి చివరి నాటికి 22.6 శాతానికి తగ్గినట్లు తెలిపింది.

రూ.500, రూ.200 నోట్ల చలామణి పెరిగింది

రూ.500, రూ.200 నోట్ల చలామణి పెరిగింది

అదే సమయంలో రూ.500, రూ.200 నోట్ల కరెన్సీ చలామణి పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. వ్యాల్యూపరంగా, సంఖ్యాపరంగా 2018నుండి క్రమంగా పెరిగాయి. మార్చి 2020 నాటికి రూ.500, రూ.2000 నోట్లు కలిపి వ్యాల్యూపరంగా 83.5 శాతంగా ఉంది. ఇదులో రూ.500 నోట్ల వ్యాల్యూ క్రమంగా పెరిగింది.

రూ.2,000 నోట్ల బ్లాక్‌మనీ... తగ్గుదల

రూ.2,000 నోట్ల బ్లాక్‌మనీ... తగ్గుదల

కరోనా మహమ్మారి నోట్ల సరఫరాను ప్రభావితం చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రధానంగా కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల 2019-20లో నోట్ల సరఫరా కూడా గత ఏడాదితో 23.3 శాతం తగ్గినట్లు వెల్లడించింది. నకిలీ నోట్ల గురించి ప్రస్తావిస్తూ... గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,96,695 నోట్లను గుర్తించగా, ఇందులో 2 వేల నోట్ల సంఖ్య17,020గా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 21,847గా ఉంది.

English summary

రూ.2,000 నోట్ల 'వ్యాల్యూ' క్రమంగా తగ్గింది, నకిలీ నోట్లు ఎన్ని అంటే! | Rs 2,000 notes were not printed in 2019-20

Currency notes of Rs 2,000 denomination were not printed in 2019-20 and the circulation of these notes have declined over the years, according to RBI's annual report.
Story first published: Tuesday, August 25, 2020, 17:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X