For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాహనాల సేల్స్ 10% క్షీణించాయి.. కానీ రికవరీకి సంకేతం

|

గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో మొత్తం ఆటోమొబైల్ సేల్స్ 10.24 శాతం క్షీణించాయి. కానీ ఫ్యాక్టరీ ఔట్ పుట్ 20 శాతం ఎక్కువగా ఉంది. కరోనా కారణంగా గత ఆరు నెలలుగా ఆటో సేల్స్ తగ్గాయి. అయితే సెప్టెంబర్ నెలలో మాత్రం చాలా కంపెనీల వాహనాల సేల్స్ పెరిగాయి. 2019 సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో గ్రీన్ షూట్ విజిబుల్ పాసింజర్ సేల్స్ 9.8 శాతం పెరిగాయి. డీలర్స్ వద్ద స్టాక్స్ పెరిగాయి. టూ-వీలర్ స్టాక్ 50 రోజులకు, పాసింజర్ వెహికిల్ స్టాక్ 40 రోజులకు పెరిగాయి. పండుగ సీజన్, కరోనా సామాజిక దూరం సహా వివిధ కారణాలతో అక్టోబర్, నవంబర్ మాసాల్లో సేల్స్ పెరుగుతాయని కంపెనీలు, డీలర్స్ భావిస్తున్నారు.

ఏ వాహనాలు ఎంత పెరిగాయి, ఎంత తగ్గాయి

ఏ వాహనాలు ఎంత పెరిగాయి, ఎంత తగ్గాయి

ఏడాది ప్రాతిపదికన ఆగస్ట్ నెలలో ఆటో సేల్స్ 27 శాతం క్షీణించాయి. కానీ సెప్టెంబర్ మాసంలో 10.24 శాతంగా ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయనేందుకు ఇది నిదర్శనం అని చెబుతున్నారు. కార్యకలాపాలు పుంజుకుంటున్నప్పటికీ, మొత్తంగా ఆటో సేల్స్ మాత్రం పూర్తిగా కోలుకోలేదు.

టూవీలర్ సేల్స్ 2019 సెప్టెంబర్‌లో 11,63,918 యూనిట్లు కాగా, 2020 సెప్టెంబర్‌లో 10,16,977 యూనిట్లుగా ఉంది. 12.62 శాతం క్షీణించింది.

పాసింజర్ వెహికిల్ సేల్స్ గత ఏఢాది 1,78,189 కాగా, ఈసారి 1,95,665గా ఉన్నాయి. సేల్స్ 9.81 శాతం పెరిగాయి.

ట్రాక్టర్ సేల్స్ గత ఏడాది 38,008 కాగా, ఈసారి 68,564 యూనిట్లుగా ఉంది. ఈ సేల్స్ ఏకంగా 80.39 శాతం పెరిగాయి.

కమర్షియల్ వెహికిల్ సేల్స్ గత ఏడాది 59,683 యూనిట్లు కాగా ఈసారి 39,600 యూనిట్లుగా ఉన్నాయి. సేల్స్ 33.65 శాతం తగ్గాయి.

3 వీలర్ సేల్స్ గత ఏడాది 58,485 యూనిట్లు కాగా, ఈసారి 24,060 యూనిట్లకు పడిపోయాయి. 58 శాతానికి పైగా క్షీణించాయి.

మొత్తంగా గత ఏడాది సెప్టెంబర్ నెలలో 14,98,283 యూనిట్లు కాగా, ఈసారి 13,44,866 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తానికి 10.24 శాతం సేల్స్ పడిపోయాయి.

పాజిటివ్ గ్రోత్

పాజిటివ్ గ్రోత్

కేంద్ర ప్రభుత్వం అన్-లాక్ నిర్ణయం నేపథ్యంలో గత మూడు నెలలుగా సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయని, సెప్టెంబర్ మాసంలో ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్లు అంతకుముందు నెల కంటే పెరిగాయని FADA ప్రెసిడెంట్ వింకేష్ గులాటి అన్నారు. ఏడాది ప్రాతిపదికన పాసింజర్ వెహికిల్ సేల్స్ మొదటిసారి సెప్టెంబర్ నెలలో పాజిటివ్ గ్రోత్ నమోదు చేశాయన్నారు.

అందుకే పెరుగుతున్నాయి

అందుకే పెరుగుతున్నాయి

సామాజిక దూరం వంటి వివిధ కారణాలతో సేల్స్ పెరుగుతున్నాయని భావిస్తున్నారు. ఇప్పుడు పండుగ సీజన్ రావడంతో సేల్స్ పెరుగుతాయని ఆశాభావంతో ఉన్నారు.గత నెలలో మారుతీ సుజుకీ, సేల్స్ ఏడాది ప్రాతిపదికన 30 శాతం పెరిగిన విషయం తెలిసిందే. ఎంజీ మోటార్ సేల్స్ మాత్రం క్షీణించాయి. ఎస్కార్ట్ ట్రాక్టర్లు రికార్డ్ స్థాయిలో సేల్స్ నమోదు చేశాయి. డొమెస్టిక్ సేల్స్ 8.09 శాతం పెరిగి 11,453 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎక్స్‌పోర్ట్స్ 19.2 శాతం పెరిగి ఏడాది ప్రాతిపదిన 398కి పెరిగాయి.

English summary

వాహనాల సేల్స్ 10% క్షీణించాయి.. కానీ రికవరీకి సంకేతం | Retail automobile sales dip 10.2 percent in September

Retail sale of automobiles in India in September registered a 10.24 percent decline over last year, painting a far less optimistic picture of the industry than the one projected by a near 20 percent jump in factory dispatches even as some green shoots have started to sprout in the passenger vehicle segment.
Story first published: Thursday, October 8, 2020, 16:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X