For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిప్టోకరెన్సీపై పునరాలోచన, బ్యాంకులకు ఆర్బీఐ సూచన

|

క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలు, ట్రేడర్స్‌తో సంబంధాలు కొనసాగించే విషయంలో పునరాలోచన చేయాలని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సూచించింది. క్రిప్టోకరెన్సీపై నిషేధం విధించే దిశగా భారత్ చట్టాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి మార్గదర్శకాలు ఆర్బీఐ నుండి బ్యాంకులకు అనధికారికంగా వచ్చినట్లుగా తెలుస్తోంది.

క్రిప్టోకరెన్సీ పరిశ్రమతో బ్యాంకులు కలిసి పని చేయవచ్చునని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ క్రిప్టో ఎక్స్ఛేంజీలు, ట్రేడర్స్‌తో సంబంధాలు రద్దు చేసుకోవాల్సిందిగా బ్యాంకులకు ఆర్బీఐ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ నుండి స్పందన రావాల్సి ఉంది. ప్రయివేటురంగ దిగ్గజం ICICI బ్యాంకు ఇప్పటికే క్రిప్టోకరెన్సీ ఆధారిత చెల్లింపు ట్రాన్సాక్షన్స్‌ను నిలిపివేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బ్యాంకు స్పందించవలసి ఉంది.

 RBI tells lenders to re consider ties with crypto exchanges, traders

యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకులు క్రిప్టోకరెన్సీ సంబంధిత ట్రాన్సాక్షన్స్‌ను పరిమితం చేసే దిశగా యోచన చేస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల క్రిప్టోకరెన్సీలకు డిమాండ్ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోకరెన్సీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి.

English summary

క్రిప్టోకరెన్సీపై పునరాలోచన, బ్యాంకులకు ఆర్బీఐ సూచన | RBI tells lenders to re consider ties with crypto exchanges, traders

India's central bank is informally urging lenders to cut ties with cryptocurrency exchanges and traders as the highly speculative market booms, despite a Supreme Court ruling that banks can work with the industry.
Story first published: Friday, May 14, 2021, 10:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X