For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ బ్యాంకుల్లో గృహ రుణాల కోసం మంజూరు చేసే మొత్తాన్ని రెట్టింపు చేసిన ఆర్బీఐ

|

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. రెపో రేట్‌ను మళ్లీ పెంచింది. నెల రోజుల వ్యవధిలో రేపో రేట్ పెంచడం ఇది రెండోసారి. కిందటి సారి కంటే ఈ పెంపు మరింత అధికం. ఇదివరకు 40 బేసిస్ పాయింట్ల మేర పెంచగా.. తాజాగా ఇప్పుడు ఈ సంఖ్యను 50కి పెంచింది. 50 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

కొన్ని ఊరటలు..

కొన్ని ఊరటలు..

ఫలితంగా రెపో రేట్ 4.9 శాతానికి పెరిగింది. దీని ప్రభావం వడ్డీ రేట్ల మీద విపరీతంగా పడింది. బ్యాంకులన్నీ తమ వడ్డీ రేట్లను మరోసారి సవరించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో మూడురోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ సమీక్షలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను శక్తికాంత దాస్ వెల్లడించారు. కొన్ని ఊరటలను కల్పించారు.

సహకార బ్యాంకుల రుణాల పరిమితి..

సహకార బ్యాంకుల రుణాల పరిమితి..

సహకార బ్యాంకుల ద్వారా గృహావసరాల కోసం మంజూరు చేసే రుణ మొత్తాలపై ఇప్పుడు ఉన్న పరిమితిని రెట్టింపు చేసింది రిజర్వ్ బ్యాంక్. అన్ని కో ఆపరేటివ్ బ్యాంకులకూ దీన్ని వర్తింపజేసింది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, రూరల్ కో ఆపరేటివ్ బ్యాంకులనూ దీని పరిధిలోకి తీసుకొచ్చింది. దీనివల్ల సహకార బ్యాంకులు మరింత బలోపేతమౌతాయని విశ్వసిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

కేటగిరీలవారీగా..

కేటగిరీలవారీగా..

ప్రస్తుతం టయర్ 1 కేటగిరి పరిధిలోకి వచ్చే సహకార బ్యాంకుల్లో గృహ నిర్మణాల అవసరాల కోసం గరిష్ఠంగా జారీ చేసే మొత్తం.. 30 లక్షల రూపాయలు. దీన్ని రెట్టింపు చేసింది ఆర్బీఐ. అంటే ఇకపై గరిష్ఠంగా 60 లక్షల రూపాయల వరకు రుణాన్ని తీసుకోవచ్చు. టయర్ 2 కేటగిరి పరిధిలోకి వచ్చే అన్ని కో ఆపరేటివ్ బ్యాంకుల్లో గృహ నిర్మాణావసరాల కోసం మంజూరు చేసే గరిష్ఠ రుణ మొత్తం 60 లక్షల రూపాయలు. దీన్ని 1.4 కోట్ల రూపాయలకు పెంచినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

గ్రామీణ సహకార బ్యాంకుల్లో ఇలా..

గ్రామీణ సహకార బ్యాంకుల్లో ఇలా..

ఇక గ్రామీణ సహకార బ్యాంకుల ద్వారా గరిష్ఠంగా మంజూరు చేసే రుణ మొత్తం ప్రస్తుతం 20 లక్షల రూపాయల వరకు ఉంటోంది. దీన్ని 50 లక్షల రూపాయలకు పెంచింది ఆర్బీఐ. 100 కోట్ల రూపాయల వరకు ఆస్తుల విలువను కలిగివున్న గ్రామీణ సహకార బ్యాంకుల నుంచి తీసుకునే గృహావసర రుణ మొత్తం మరింత పెరిగింది. 30 నుంచి 75 లక్షల రూపాయల వరకు పెంచింది.

రాష్ట్ర, జిల్లా కేంద్ర బ్యాంకుల్లోనూ..

రాష్ట్ర, జిల్లా కేంద్ర బ్యాంకుల్లోనూ..

రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు కూడా ఇదే వర్తిస్తుంది. కో ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా గృహావసరాల కోసం మంజూరు చేసే రుణాల పరిమితిని చివరిసారిగా 2011లో సవరించింది. ఇప్పుడు మళ్లీ వాటిలో సవరణలను తీసుకొచ్చింది. రుణ పరిమితిని రెట్టింపు చేయడం ద్వారా సహకార బ్యాంకులు బలోపేతమౌతాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

English summary

ఈ బ్యాంకుల్లో గృహ రుణాల కోసం మంజూరు చేసే మొత్తాన్ని రెట్టింపు చేసిన ఆర్బీఐ | RBI raising the existing limits on individual housing loans by cooperative banks

RBI said it is raising the existing limits on individual housing loans by cooperative banks.
Story first published: Wednesday, June 8, 2022, 13:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X