For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ యాప్స్‌తో చాలా జాగ్రత్త, ఉచ్చులో పడొద్దు: RBI హెచ్చరిక, పలువురి అరెస్ట్

|

అధిక వడ్డీని వసూలు చేస్తోన్న రుణ యాప్స్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఈ మేరకు ఆర్బీఐ సీజీఎం యోగేష్ దయాల్ మాట్లాడుతూ... ఆర్బీఐ వద్ద గుర్తింపు పొందిన బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీకి లోబడి ఉన్న రుణ సంస్ధల వద్ద మాత్రమే రుణాలు తీసుకోవాలని, కానీ ఎలాంటి నియమ నిబంధనలు పాటించని యాప్స్ వద్ద రుణాలు తీసుకోవద్దని సూచించారు. కొన్ని యాప్స్ రుణాల పేరుతో పలువురి దగ్గర నుండి అధిక వడ్డీలను, ఛార్జీలను వసూలు చేస్తున్నట్లుగా తెలిసిందని, ఇలా అధిక వడ్డీలు సరికాదని తెలిపారు.

టేక్ హోం శాలరీ తగ్గుతుంది, కంపెనీలకు భారం: కొత్త వేతన చట్టం వద్దేవద్దు!టేక్ హోం శాలరీ తగ్గుతుంది, కంపెనీలకు భారం: కొత్త వేతన చట్టం వద్దేవద్దు!

ఫిర్యాదు చేయండి..

ఫిర్యాదు చేయండి..

రుణాల కోసం మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వవద్దని సీజీఎం సూచించారు. మీ వ్యక్తిగత వివరాలతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశముందన్నారు. ఎంతో సులభంగా రుణాలు ఇస్తున్నారని ఈ యాప్స్ ద్వారా రుణాలు తీసుకొని, అలాంటి వారి మాయలో పడవద్దన్నారు. రుణాలు తీసుకునే ముందు ఆలోచించాలిని, ఎవరైనా అలాంటి యాప్స్ ద్వారా వెంటనే https://sachet.rbi.org.in వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు. కస్టమర్లు మీ కేవైసీ డాక్యుమెంట్స్‌ను ఎవరితోను షేర్ చేయవద్దన్నారు.

గుర్తింపు పొందినవి అయితే..

గుర్తింపు పొందినవి అయితే..

బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీల డిజిటల్ రుణ యాప్స్ కూడా గుర్తింపు వివరాలను కస్టమర్ల ముందు ఉంచాలన్నారు. గుర్తింపు పొందిన రుణ యాప్స్ పైన ఫిర్యాదుల కోసం https://cms.rbi.org.in ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు.

పలువురి అరెస్ట్

పలువురి అరెస్ట్

యాప్ ఆధారిత రుణగ్రహీతలపై చర్యల్లో ఆర్బీఐ చర్యలు తీసుకోవడం ఇది రెండోసారి. బ్యాంకులు, నాన్ బ్యాంక్ ఫైనాన్షియర్లు తమ సొంత డిజిటల్ ప్లాట్ ఫామ్ లేదా అవుట్ సోర్స్ చేసిన సంస్థ ద్వారా రుణాలు ఇస్తున్నారా అనే అంశంతో సంబంధం లేకుండా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని తెలిపింది. ఇదిలా ఉండగా, ఆన్ లైన్ ద్వారా రుణాలు ఇస్తామని వేధింపులకు గురి చేస్తున్న వ్యవహారంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఐదుగురు, హైదరాబాద్‌లో 6గురిని అరెస్ట్ చేశారు.

English summary

ఆ యాప్స్‌తో చాలా జాగ్రత్త, ఉచ్చులో పడొద్దు: RBI హెచ్చరిక, పలువురి అరెస్ట్ | RBI cautions against unauthorised lending apps

The Reserve Bank of India (RBI) on Wednesday cautioned individuals and small businesses against falling prey to growing number of unauthorised digital lending platforms and mobile apps on promises of getting loans in quick and hassle-free manner.
Story first published: Wednesday, December 23, 2020, 20:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X