For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బోల్డ్‌గా... నిర్మలమ్మ బడ్జెట్‌కు 10/10, చైనాను అధిగమిస్తాం: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

|

ముంబై: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పెక్కుమంది ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు. జనాకర్షణకు కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని చెబుతున్నారు. ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఈ బడ్జెట్‌కు పదికి పది మార్కులు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఆకర్షణ బడ్జెట్ కాకుండా వివిధ రంగాలకు ఊతమిచ్చేలా చర్యలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిపై ఝున్‌ఝున్‌వాల్ స్పందించారు.

పదికి 10 మార్కులు

పదికి 10 మార్కులు

నిర్మలమ్మ బడ్జెట్‌కు తాను 10కి పది మార్కులు ఇస్తానని రాకేష్ ఝున్‌ఝున్ వాలా తెలిపారు. ఈ బడ్జెట్ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ప్రకటించారన్నారు. భారత జీడీపీ డబుల్ డిజిట్ దిశగా తీసుకెళ్లడానికి కీలక అడుగు అని అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌ను మనం అర్థం చేసుకునే దాని కంటే ఎక్కువే ఉందన్నారు. పునరుజ్జీవ భారత్ కోసం ఇది వాస్తవికత బడ్జెట్ అన్నారు. భారత ప్రభుత్వం బోల్డ్‌గా ఉందని ఈ బడ్జెట్ చూపించిందన్నారు. రాబోయే 25 ఏళ్లలో చైనాను భారత్ అధిగమిస్తుందన్నారు.

బోల్డ్ బడ్జెట్

బోల్డ్ బడ్జెట్

బోల్డ్ బడ్జెట్ నేపథ్యంలో ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలమ్మకు ఆయన కాంగ్రాట్స్ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని ఈ బడ్జెట్ ద్వారా వెల్లడించారన్నారు. FY22లో భారత ఫిస్కల్ డెఫిసిట్ 6 శాతం నుండి 6.5 శాతం మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు రాకేష్. అలాగే, ట్యాక్స్ కలెక్షన్స్ బాగుంటాయని భావిస్తున్నారు.

పారిశ్రామికవేత్తలు

పారిశ్రామికవేత్తలు

బడ్జెట్ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలు సాహసోపేతమని భారతీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. ఈ బడ్జెట్ ప్రజల బాధలు తీర్చేలా ఉందని ఆనంద్ మహీంద్రా అన్నారు. అవసరమైన రంగాలకు కేటాయింపులు జరిగాయని ఉదయ్ కొటక్ అన్నారు.

English summary

బోల్డ్‌గా... నిర్మలమ్మ బడ్జెట్‌కు 10/10, చైనాను అధిగమిస్తాం: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా | Rakesh Jhunjhunwala gives 10/10 to Budget 2021

Rakesh Jhunjhunwala gives 10/10 to Budget 2021, says India on way to achieving double-digit growth.
Story first published: Tuesday, February 2, 2021, 20:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X