For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Q4 Results: కంపెనీలపై మార్జిన్ ఒత్తిడి, టెక్ అదుర్స్

|

సిమెంట్ నుండి ఎఫ్ఎంసీజీ వరకు అన్ని రంగాలు, దాదాపు అన్ని కంపెనీలు కూడా మార్జిన్ ఒత్తిడిలో ఉన్నాయి. కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచినప్పటికీ, అంతకంతకూ పెరుగుతున్న ముడిసరుకు పెరుగుదల, ఇంధన ధరల పెరుగుదల లాభాలపై ప్రభావం చూపుతోంది. వాస్తవానికి ఇటీవలి కంపెనీలు ఫలితాలు ప్రకటిస్తున్న సమయానికి నిర్వహణ ఖర్చు భారం కాస్త తగ్గినప్పటికీ చాలా కంపెనీల ఫలితాలు మాత్రం ఆశించినంతగా లేవు.

దాదాపు 73 కంపెనీలు నాలుగో త్రైమాసికం ఫలితాలు ప్రకటించాయి. ఏడాది ప్రాతిపదికన కేవలం 12 శాతం మాత్రమే పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ ప్రాఫిట్ ఏడాది ప్రాతిపదికన 65 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఇది నిర్వహణ లాభంపైన 10 శాతం ప్రభావం చూపింది.

కంపెనీ నిర్వహణ మార్జిన్

కంపెనీ నిర్వహణ మార్జిన్

నెస్ట్లే స్థూల మార్జిన్‌లలో ఏడాది ప్రాతిపదికన 315 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. ఇది ఎడిబుల్ ఆయిల్స్, ప్యాకేజింగ్ మెటిరీయల్స్ వంటి కీలక ఉత్పత్తుల ద్రవ్యోల్భణం తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన 10.2 శాతంతో మంచి వృద్ధి కనిపిస్తున్నప్పటికీ, కంపెనీ నిర్వహణ మార్జిన్ మాత్రం ఏడాది ప్రాతిపదికన 200 బేసిస్ పాయింట్లు తగ్గి 23.2 శాతానికి క్షీణించింది. ఎబిటా ఫ్లాట్‌గా నిలిచింది.

పెరుగుతున్న సిమెంట్ ధరలు

పెరుగుతున్న సిమెంట్ ధరలు

ఏసీసీ సిమెంట్ సంస్థ ఆపరేటింగ్ మార్జిన్ ఏడాది ప్రాతిపదికన 600 బేసిస్ పాయింట్లు తగ్గి 14.3 శాతానికి తగ్గింది. ప్రతి టన్నుకు నిర్వహణ ఖర్చులు 13 శాతం పెరిగాయి. ఈ ప్రభావం పడింది. దీంతో కంపెనీ నిర్వహణ లాభం 25 శాతం క్షీణించింది.ఇటీవల సిమెంట్ ఉత్పత్తిదారులు ధరలు పెంచుతున్నారు. మార్చి కంటే ఏప్రిల్ నెలలో 5 శాతం నుండి 6 శాతం పెరుగుదల కనిపించింది. డీజిల్, బొగ్గు, పెట్ కోక్ పైన అయ్యే అదనపు ఖర్చు 9 శాతం నుండి 10 శాతం పెంపు అవసరమని భావిస్తున్నారు.

టెక్ అదుర్స్

టెక్ అదుర్స్

గత త్రైమాసికంలో టెక్ దిగ్గజాలు మాత్రం సానుకూల ఫలితాలను నమోదు చేశాయి. టీసీఎస్ 11.3 బిలియన్ డాలర్ల ఆర్డర్స్ రికార్డుతో అదరగొట్టింది. త్రైమాసికం పరంగా ఎబిటా మార్జిన్ మాత్రం 24.96 శాతం వద్ద దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఇన్ఫోసిస్ అంచనాలు మిస్ అయ్యాయి. 27 శాతం అధిక ఆట్రిషన్‌తో సమస్య ఎదుర్కొంటోంది. ఎబిటా మార్జిన్ 21.5 శాతంగా ఉంది. మొత్తానికి భారతీయ కంపెనీల ఇటీవలి త్రైమాసిక ఫలితాలను చూస్తుంటే మార్జిన్ ఒత్తిడిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

English summary

Q4 Results: కంపెనీలపై మార్జిన్ ఒత్తిడి, టెక్ అదుర్స్ | Q4 Results: India Inc feels margin pressure

From cement to FMCG, the story so far is one of margin pressure. The spike in the cost of raw materials and fuel is eating into profits even as companies raise prices. Indeed, the earnings season has got off to a somewhat subdued start, with most results disappointing the Street.
Story first published: Monday, April 25, 2022, 9:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X