For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త ఏడాదిలో శుభవార్త: 7లక్షల ఉద్యోగాలు, ఈ రంగంలో ఎక్కువ, శాలరీ పెరుగుదల మాత్రం..

|

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఆర్థిక మందగమనం కారణంగా కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగ రేటు నలభై ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. 2019 తొలి అర్ధ సంవత్సరం ఎకానమీపరంగా బాగుండగా, రెండో అర్ధభాగం మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంది. జీడీపీ పడిపోయింది. రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ, ఆటో సెక్టార్లు దారుణంగా పడిపోయాయి. ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త సంవత్సరంలో ఓ సర్వే శుభవార్త తెలిపింది. 2020లో ప్రయివేటు ఉద్యోగాలు జోరుగా వస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది.

షాకింగ్: 40% ఉన్న 8 కీలక రంగాల ఉత్పత్తి ఎంత పడిపోయిందంటే?షాకింగ్: 40% ఉన్న 8 కీలక రంగాల ఉత్పత్తి ఎంత పడిపోయిందంటే?

కొత్త ఏడాదిలో 7 లక్షల ఉద్యోగాలు

కొత్త ఏడాదిలో 7 లక్షల ఉద్యోగాలు

దేశంలో ప్రయివేటురంగంలోనే ఎక్కువ మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ప్రయివేటు రంగం గత ఏడాది కూడా లక్షలాది మంది కొత్త వారికి ఉపాధి కల్పించింది. 2020లోను 7 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ మేరకు MyHiringClub.com & Sarkari-Naukri.info సంయుక్తంగా నిర్వహించిన ఎంప్లాయిమెంట్ ట్రెండ్ సర్వే-2020లో (MSETS) వెల్లడైంది. ప్రయివేటు సంస్థలు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

ఈ నగరాల్లోనే 5 లక్షలకు పైగా ఉద్యోగాలు

ఈ నగరాల్లోనే 5 లక్షలకు పైగా ఉద్యోగాలు

42 సిటీలలోని 12 రంగాలకు సంబంధించి 4,278 కంపెనీలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ-NCR, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణెలు ఉద్యోగ కల్పనలో తొలి స్థానాల్లో ఉన్నాయని సర్వేలో తేలింది. ఈ సిటీల్లో సంయుక్తంగా 5,14,900 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

కార్పోరేట్ కంపెనీల చిన్ననగరాల బాట

కార్పోరేట్ కంపెనీల చిన్ననగరాల బాట

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మిగతా ఉద్యోగాలు లభించనున్నాయి. మెట్రో నగరాల కంటే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఖర్చులను తగ్గించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు చిన్న నగరాల బాట పట్టడం ఇందుకు కారణమని సర్వేలో వెల్లడైంది. నైపుణ్యం కలిగిన సిబ్బందితో పోలిస్తే టెక్నాలజీ లేదా టెక్నికల్ నైపుణ్యం కలిగిన సిబ్బందికి అధిక డిమాండ్‌ ఉందని సర్వేలో తేలింది.

రిటైల్, ఈ-కామర్స్‌లో ఎక్కువ ఉద్యోగాలు

రిటైల్, ఈ-కామర్స్‌లో ఎక్కువ ఉద్యోగాలు

కొత్త కొలువుల్లో ఎక్కువగా రిటైల్, ఈ-కామర్స్ విభాగాల్లో రానున్నాయి. ఇందులో 1.12 లక్షల కొత్త ఉద్యోగాలు ఈ ఏడాది రానున్నాయి. ఆ తర్వాత ఐటీ, ఐటీ సేవలలో 1,05,500, హెల్త్ కేర్‌లో 98,300, ఎఫ్ఎంసీజీలో 87,500, తయారీ రంగంలో 68,900, బీఎఫ్ఎస్ఐలో 59,700 ఉద్యోగాలు రానున్నాయి. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ సేల్స్ పెరిగిపోతున్నాయి. దీంతో కొత్త సంస్థలు పుట్టుకు రావడంతో పాటు లక్షలాది మందికి ఈ అయిదేళ్లలో ఉపాధి కల్పిస్తోంది ఈ-కామర్స్ రంగం.

వేతనాలు, బోనస్‌లలో సింగిల్ డిజిట్.. మొత్తం పెరుగుదల 8 శాతం

వేతనాలు, బోనస్‌లలో సింగిల్ డిజిట్.. మొత్తం పెరుగుదల 8 శాతం

ఈ సర్వే 2019లో 5.9 లక్షల మందికి ఉపాధి లభించనుందని గతంలో అంచనా వేసింది. అయితే అంతకుమించి 6.2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్లు పేర్కొంది. ఇక, శాలరీస్, బోనస్‌లలో వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితం కానుందని, మొత్తం మీద వేతనాల్లో పెరుగుదల 8 శాతంగా ఉండనుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఉద్యోగులకు ప్రతి ఏటా ఇచ్చే ఇంక్రిమెంట్స్ 8 శాతం పెరగనుండగా, బోనస్ మాత్రం 10 శాతం పెరగనుందని సర్వేలో వెల్లడైనట్లు MSETS సీఈవో రాజేష్ కుమార్ తెలిపారు.

ప్రొఫెషనల్స్‌కు పెద్దపీట

ప్రొఫెషనల్స్‌కు పెద్దపీట

నైపుణ్య కొరత ఎక్కువగా ఉన్నందున కార్పొరేట్ సంస్థలు ప్రొఫెషనల్స్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి.

ఏ ప్రాంతంలో ఎన్ని ఉద్యోగాలు అంటే

ఏ ప్రాంతంలో ఎన్ని ఉద్యోగాలు అంటే

ఇక, ఉద్యోగ కల్పనలో సౌత్ ఇండియా మొదటి స్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే వెల్లడించింది. కొత్త ఏడాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 2,15,400, ఉత్తర భారతదేశంలో 1,95,700, పడమరలో 1,65,700, తూర్పులో 1,25,800 కొత్త ఉద్యోగాలు ప్రయివేటు రంగంలో రానున్నాయి.

English summary

కొత్త ఏడాదిలో శుభవార్త: 7లక్షల ఉద్యోగాలు, ఈ రంగంలో ఎక్కువ, శాలరీ పెరుగుదల మాత్రం.. | Private companies to generate 7 lakh jobs in 2020

With bullish hiring sentiments, private sector players are likely to create seven lakh jobs and the overall increase in salaries is projected to be around 8 per cent in the New Year, according to a survey.
Story first published: Thursday, January 2, 2020, 8:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X