For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముందు అలా.. ఆ తర్వాత ఇలా: దీపావళి తర్వాత పడిపోయిన స్మార్ట్‌ఫోన్ సేల్స్

|

పండుగ సీజన్‌లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పుంజుకున్నాయి. దసరా, దీపావళి వరకు మొబైల్ ఫోన్ అమ్మకాలు రికార్డులు సృష్టించాయి. అయితే దీపావళి తర్వాత సేల్స్ పడిపోయాయి. దీపావళికి ముందు దుకాణదారులకు నవ్వులు పూయించిన సేల్స్ ఆ తర్వాత 20 శాతం నుండి 25 శాతం మేర పడిపోయాయి. ఇది తమకు బ్లాక్ సీజన్ అని నేషనల్ రిటైల్ స్టోర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. సేల్స్ 50 శాతం మేర పడిపోయాయని చెబుతున్నారు.

25 శాతం క్షీణించవచ్చు

25 శాతం క్షీణించవచ్చు

స్మార్ట్ ఫోన్ సేల్స్ నవంబర్ నెలలో దాదాపు 25 శాతం క్షీణించవచ్చునని, డిసెంబర్ నెలలో మరింతగా పడిపోవచ్చునని కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ మార్కిట్ రీసెర్చ్ తెలిపింది. సాధారణంగా ప్రతి దీపావళి సీజన్ సమయంలో నెల ప్రాతిపదికన సేల్స్ దీపావళి పండుగ తర్వాత క్షీణిస్తాయని, కానీ ఈసారి మరీ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. దసరా పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎక్కువ షిప్‌మెంట్స్ ఉంటాయి. ఈసారి దీపావళి తర్వాత కూడా సేల్స్ వెంటనే పడిపోయాయి. సేల్ క్షీణత 20 శాతం నుండి 25 శాతం మధ్య ఉండవచ్చునని భావిస్తున్నారు.

డిస్కౌంట్, డీల్స్ వల్ల

డిస్కౌంట్, డీల్స్ వల్ల

ప్రధానంగా భారీ డిస్కౌంట్లు, డీల్స్ ద్వారా ఈ పండుగ సమయంలో సేల్స్ పెరుగుతాయని, సాధారణ రోజుల్లో జరిగే సేల్స్ కంటే రెండు మూడింతలు అంతకంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే సేల్స్ బాగున్నప్పటికీ, దీపావళి తర్వాత అంతేస్థాయిలో సేల్స్ హఠాత్తుగా పడిపోయినట్లు చెబుతున్నారు. వచ్చే నెల డిమాండ్ సాధారణంగా ఉండే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

రికార్డ్ సేల్స్.. అంతలోనే డౌన్

రికార్డ్ సేల్స్.. అంతలోనే డౌన్

మొబైల్ ఫోన్ టాప్ బ్రాండ్స్ షియోమీ, వివో, రియల్‌మి కంపెనీలు ఈ దీపావళి సమయంలో రికార్డు సేల్స్‌ను నమోదు చేశాయ. జూలై-సెప్టెంబర్ కాలంలో ఆపిల్ భారీ షిప్‌మెంట్స్ నమోదు చేసింది. లేటెస్ట్ ఐఫోన్స్ లాంచింగ్‌కు ముందే సేల్స్ రికార్డు సృష్టించాయ. అయినప్పటికీ రిటైలర్స్ వద్ద మాత్రం సేల్స్ 50 శాతం పడిపోయాయి. తమకు అక్టోబర్ వరస్ట్ నెల అని, నవంబర్ నెలలో సేల్స్ పుంజుకున్నప్పటికీ, దీపావళి తర్వాత మళ్లీ పడిపోయాయని రిటైలర్స్ వాపోతున్నారు. ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ 1,50,000 స్టోర్స్‌కు నేతృత్వం వహిస్తోంది.

English summary

ముందు అలా.. ఆ తర్వాత ఇలా: దీపావళి తర్వాత పడిపోయిన స్మార్ట్‌ఫోన్ సేల్స్ | Post Diwali sales drop leaves smartphone companies with mixed feelings

After record-breaking smartphone sales until Diwali, demand has slumped 20-25% on-month in November so far, retailers and experts said.
Story first published: Wednesday, November 25, 2020, 21:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X