For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020లో 4-5 మినీ బడ్జెట్‌లు: ప్రధాని మోడీ వ్యాఖ్య

|

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 29) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ దశాబ్దానికి ఇది తొలి బడ్జెట్ అని, ఈ రోజు మొదటి సెషన్ అని, దేశ అత్యుత్తమ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో కీలకమని ప్రధాని అన్నారు.

మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేయడానికి ఎంతో మంచి అవకాశాలు వస్తున్నాయని, వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ అంశాలపై సమావేశాలు కొనసాగాలన్నారు.

బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి

PM Modi says 2020 economic packages were 4 to 5 mini budgets

భారత దేశ చరిత్రలో తొలిసారి గత ఏడాది ఆర్థికమంత్రి ప్యాకేజీల రూపంలో నాలుగైదు మినీ బడ్జెట్‌లు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు ప్యాకేజీని ప్రకటించారు. దీనిని మోడీ గుర్తు చేస్తూ 2020లో మినీ బడ్జెట్‌లు ప్రవేశ పెట్టామన్నారు.

ఈ శతాబ్దానికి ఇది తొలి సమావేశం అన్నారు. ఈ దశాబ్దాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటులో చర్చలు జరగాలన్నారు. కాగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.

English summary

2020లో 4-5 మినీ బడ్జెట్‌లు: ప్రధాని మోడీ వ్యాఖ్య | PM Modi says 2020 economic packages were 4 to 5 mini budgets

Ahead of the beginning of the Budget Session of Parliament on Friday, Prime Minister Narendra Modi said the day marks the beginning of the Parliament session of a new decade that will see a bright future for India. PM Modi said the economic packages of 2020 were as good as mini budgets.
Story first published: Friday, January 29, 2021, 12:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X