For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన క్రూడాయిల్ దిగుమతులు, భారీగా పెరిగిన ఎగుమతులు

|

2020 రెండో క్వార్టర్‌లో కరోనా మహమ్మారి-లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ రోజుకు 8 శాతం తగ్గి ఇది 4,597 వేల బ్యారెళ్లకు చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) తన మే చమురు మార్కెట్ నివేదికలో భాగంగా తెలిపింది.

 ఆదాయపు పన్ను తగ్గింపు లేదు, ప్యాకేజీలో డబ్బులు చేతికి ఎందుకివ్వలేదంటే?: నిర్మల ఆదాయపు పన్ను తగ్గింపు లేదు, ప్యాకేజీలో డబ్బులు చేతికి ఎందుకివ్వలేదంటే?: నిర్మల

తగ్గిన పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్

తగ్గిన పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్

భారత్‌లో క్వార్టర్ 1లో చమురు డిమాండ్ రోజుకు 180వేలకు తగ్గుతుందని, అలాగే 2020లో 1.3 మిలియన్ బ్యారెళ్లకు తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. నాలుగో క్వార్టర్ నాటికి లాక్ డౌన్ కంటే ముందు స్థాయికి రావొచ్చునని అంచనా వేసింది. మొత్తంగా చమురు డిమాండ్ ఇండియాలో రోజుకు 415వేల బ్యారెళ్లుగా ఉండవచ్చునని తెలిపింది. గ్యాసాయిల్, డీజిల్, గ్యాసోలిన్ పైన కూడా భారీ ప్రభావం పడుతుందని తెలిపింది.

ఏప్రిల్, మే నెలల్లో 40 శాతం తగ్గుదల

ఏప్రిల్, మే నెలల్లో 40 శాతం తగ్గుదల

ప్రధానంగా లాక్ డౌన్ నేపథ్యంలో రెండో క్వార్టర్‌లో పెట్రోల్ డిమాండ్ రోజుకు 350 వేల డాలర్లకు పడిపోతుందని అంచనా వేసింది. పెట్రోల్ డిమాండ్ ఏప్రిల్, మే నెలల్లో 60 శాతం వరకు తగ్గవచ్చునని తెలిపింది. డీజిల్ డిమాండ్ 690 వేల బ్యారెళ్లకు తగ్గవచ్చునని పేర్కొంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF), కిరోసిన్ డిమాండ్ ఏప్రిల్, మే నెలల్లో 40 శాతం తగ్గవచ్చునని తెలిపింది.

ఉత్పత్తిలోను తగ్గుదల

ఉత్పత్తిలోను తగ్గుదల

మొత్తమ్మీద ఆయిల్ డిమాండ్ 2020 క్యాలెండర్ ఏడాదిలో 4.60 మిలియన్ బ్యారెళ్లకు పడిపోతుందని అంచనా వేసింది. ఇది 2019లో 5.01 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది. డొమెస్టిక్ క్రూడాయిల్ ప్రొడక్షన్ 2020లో తగ్గుతుందని అంచనా వేసింది. కార్మికుల కొరత, వాటర్ కట్ వంటి వివిధ కారణాలతో ఉత్పత్తి తగ్గుతుందని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం రాబోయే నెలల్లో ముడి చమురు ఉత్పత్తి తగ్గుతుంది. 2019లో ఇది 0.80 మిలియన్ బ్యారెల్స్‌‌గా ఉండగా 2020లో 0.75 మిలియన్ బ్యారెళ్లకు తగ్గుతుందని తెలిపింది.

తగ్గిన దిగుమతులు, పెరిగిన ఎగుమతులు

తగ్గిన దిగుమతులు, పెరిగిన ఎగుమతులు

ఇదిలా ఉండగా ఏప్రిల్ నెలలో క్రూడాయిల్ దిగుమతులు 10 నెలల కనిష్టాన్ని నమోదు చేశాయి. ఏప్రిల్‌లో ముడి చమురు దిగుమతులు 12.4 శాతం తగ్గి 17.28 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2019 జూన్ నుంచి ఇది అత్యంత తగ్గుదల అని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ తెలిపింది. చమురు ఉత్పత్తుల దిగుమతులు 6.5 శాతం తగ్గి 3.35 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఇది 16 నెలల కనిష్టం. అయితే రిఫైన్డ్ ఎక్స్‌పోర్ట్స్ మాత్రం అక్టోబర్ 2016 నుండి గరిష్టానికి చేరుకున్నాయి.

English summary

భారీగా తగ్గిన క్రూడాయిల్ దిగుమతులు, భారీగా పెరిగిన ఎగుమతులు | Petroleum product demand to fall 8 per cent in 2020

India’s petroleum product demand is expected to fall by eight per cent to 4,597 thousand barrels per day in 2020, International Energy Agency (IEA) said as part of its May oil market report.
Story first published: Saturday, May 23, 2020, 16:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X