కరోనా వైరస్ నేపథ్యంలో పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేందుకు చాలా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ దిశగా కొన్ని కంపెనీలు ప్రకటనలు చేశాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫేస్‌బుక్, అల్ఫాబెట్-గూగుల్ సహా పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఏడాది పాటు ఇంటి నుండి పని చేయాలని సూచించాయి. మహమ్మారి తగ్గిన తర్వాత కూడా ఉద్యోగులు ఇంటి నుండి పని చేయవచ్చునని ట్విట్టర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు నో
శాశ్వతంగా ఇంటి నుండే పని చేసే విధానం సరికాదని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తే ఉద్యోగుల్లో అనేక దుష్పరిణామాలు వస్తాయని తెలిపారు. పర్మినెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకున్న ఉద్యోగులకు వ్యాయామం, ఎలా వారి మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. రిమోట్‌గా పని చేయడం అంటే మనుషుల మధ్య సామాజిక బంధాలను నాశనం చేయడమే అన్నారు.

ఇది మిస్ అవుతారు...
సోషల్ ఇంటరాక్షన్ దెబ్బతింటుందని, తద్వారా మానసికంగా హాని కలుగుతుందని సత్య నాదెళ్ల అన్నారు. వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చాలా వెలితి ఉంటుందన్నారు. నేరుగా సమావేశాలు ఏర్పాటు చేస్తే (అంటే వర్చువల్ కాకుండా అందరూ ఒకేచోట భౌతికంగా భేటీ) మీ పక్కన ఉన్న వ్యక్తులతో కనీసం రెండు నిమిషాలు అయినా మాట్లాడి కనెక్ట్ అవుతారని చెప్పారు. ఇది మిస్ అవుతారన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగ్స్ ద్వారా అవి సాధ్యం కావని అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌లు పర్సనల్ మీటింగ్స్‌ను భర్తీ చేయలేవన్నారు.

వీటి మాటేమిటి
కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వారి పని ఉత్సాహం, మానసిక పరిస్థితి, ఇతరులతో కనెక్టివిటీ, సమాజంలో కలవలేని పరిస్థితి.. వంటివి ఎక్కడ ఉంటాయని సత్య నాదెళ్ల అన్నారు. శాశ్వతంగా ఇంటి నుండి పని అంటే ఎక్కువ ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కంపెనీలు తమ నియమ నిబంధనలను కూడా మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. రిమోట్ సెటప్‌గా మారిపోవడం అంటే ఒక మూఢత్వంలో నుండి మరో మూఢత్వంలోకి జారి పోవడమే అన్నారు.

అక్టోబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్
కరోనా మహమ్మారి నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అక్టోబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగించింది. కరోనా ప్రభావం మైక్రోసాఫ్ట్ పైన మరీ అంతగా పడలేదు. ఈ టెక్ దిగ్గజం స్టాక్స్ ఈ ఏడాది 14 శాతం పెరిగాయి. కంపెనీ 140 బిలియన్ డాలర్ల నగదును కలిగి ఉంది. ఇటీవలి బైబ్యాక్స్, డివిడెండ్స్ పైన మైక్రోసాఫ్ట్ 10 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications