For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న నగరాల్లో ఉద్యోగాలు, ఎక్కడి నుండైనా పని చేసే వీలు కల్పిస్తున్నాం

|

చిన్న నగరాల నుండి సిబ్బందిని నియమించుకునేందుకు ప్రయత్నాలు రెట్టింపు చేశామని పేమెంట్ యాప్ పేటీఎం తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పెద్ద నగరాల్లోని కార్యాలయాలకు వచ్చి పని చేయాల్సిన అవసరం లేకుండా, ఇంటినుండి లేదా వారికి నచ్చిన ప్రాంతం నుండి పని చేసే వీలు కల్పిస్తున్నట్లు పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర శర్మ తెలిపారు. కరోనా పరిస్థితులు అదుపులోకి రాగానే కొత్తగా నియమితులయ్యే వారిని పెద్ద నగరాల్లోని కార్యాలయాలకు రప్పించాలని తొలుత భావించామని, కానీ చిన్న నగరాల నుండి నియామకాలు చేపట్టాలనేది తమ తాజా ప్రణాళిక అని తెలిపారు.

<strong>భారీ నష్టాలు, రుణభారంతో మహీంద్రా 'శాంగ్‌యాంగ్' దివాలా పిటిషన్</strong>భారీ నష్టాలు, రుణభారంతో మహీంద్రా 'శాంగ్‌యాంగ్' దివాలా పిటిషన్

25 శాతం వరకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోం

25 శాతం వరకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోం

చిన్న నగరాల్లో నియమించుకున్న వారిని పెద్ద నగరాల్లోని కార్యాలయాల్లో చేరాలని కూడా తాము అడగడం లేదని విజయ శేఖర శర్మ తెలిపారు. అందుకే చిన్న నగరాల్లో సిబ్బందిని నియమించుకునే ప్రక్రియను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు క్లియర్ ట్యాక్స్ ఇ-ఇన్వాయిసింగ్ లీడర్‌షిప్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎక్కడి నుండి అయినా పని చేసే పద్ధతిని భవిష్యత్తులో పూర్తిగా తొలగించకపోయినప్పటికీ 20 శాతం నుండి 25 శాతం సిబ్బందికి దీనిని అప్లై చేస్తామని తెలిపారు.

అలాంటి టెక్నాలజీ

అలాంటి టెక్నాలజీ

చండీగడ్, జలంధర్, ఒరిశా వంటి నగరాల నుండి తీసుకుంటామని, వారిని పెద్ద నగరాల్లోని కార్యాలయాల్లో చేరాలని అడగమని చెప్పారు. ప్రపంచ సాఫ్టువేర్ రంగంలో భారత్‌కు అత్యంత ప్రాధాన్యత ఉన్నదని అభిప్రాయపడ్డారు. పేటీఎం ప్రైమరీ మార్కెట్‌గా ఉంటుందన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో అంతర్జాతీయ మార్కెట్ కోణాన్ని మరింతగా ఆవిష్కరిస్తామన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు ఇష్టమైన, ప్రపంచం గౌరవించే భారతీయ సాంకేతికతను నిర్మించడమే తమ ఉద్దేశ్యమన్నారు.

కరోనాతో మారిన పనితీరు

కరోనాతో మారిన పనితీరు

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ, భారత కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ప్రధానంగా ఐటీ సంస్థలు 96 శాతం వరకు ఇంటి నుండి పనికి అవకాశం కల్పించాయి. ఐటీ, ఐటీ ఏనెబుల్డ్ సర్వీసెస్ కంపెనీలు ఈ హైబ్రిడ్ మోడల్ దిశగా ఆలోచన చేస్తున్నాయి. కొంతమంది ఉద్యోగుల రిమోట్ వర్క్ ఎప్పటికీ ఉండేలా ఆలోచన చేస్తున్నాయి.

English summary

చిన్న నగరాల్లో ఉద్యోగాలు, ఎక్కడి నుండైనా పని చేసే వీలు కల్పిస్తున్నాం | Paytm is doubling down on efforts to hire from smaller towns: Vijay Shekhar Sharma

Paytm has doubled down on its efforts to hire staff from smaller towns and allow them to continue working from those locations even after the pandemic situation eases, founder Vijay Shekhar Sharma said.
Story first published: Thursday, December 24, 2020, 13:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X