For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

8 దశాబ్దాల్లో రికార్డ్ సేల్స్: లాక్ డౌన్ సమయంలో పార్లే జీ విక్రయాలు ఫుల్, ఎందుకంటే..?

|

కరోనా వైరస్ వల్ల దేశంలో లాక్ డౌన్ కొనసాగింది. విడతలవారీగా కంటిన్యూ అవడంతో.. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లని పరిస్థితి.. ఈ క్రమంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. తీసుకున్న స్టఫ్ బిస్కట్లు, బ్రెడ్ జామ్. బిస్కెట్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పార్లే జీ మాత్రమే. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటూ.. టెస్టీగా ఉండే బిస్కట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

1938లో ఏర్పాటు..

1938లో ఏర్పాటు..

పార్లే జీ సంస్థ 1938లో స్థాపించారు. కంపెనీ అప్పటినుంచి క్రమంగా ఎదిగింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉత్పత్తులను రూపొందిస్తోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో పార్లే జీ సంస్థ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. కానీ ఎంతమొత్తంలో విక్రయాలు జరిగాయనే అంశాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మార్చి, ఏప్రిల్, మే నెలలో పార్లే జీ సంస్థ ఉత్పత్తలు విక్రయం గణనీయంగా జరిగాయి.

బిస్కెట్లు తింటూ

బిస్కెట్లు తింటూ

లాక్ డౌన్ సమయంలో సరదాగా తినేందుకు కూడా బిస్కెట్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేశారు. అందులో పార్లే జీ సంస్థ ప్రొడక్ట్స్ గణనీయంగా ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో ఉత్పత్తి నిలిచిపోయే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీవో సంస్థల బిస్కెట్లను ఉత్పత్తి చేయాలని అభ్యర్థించారు. మార్చి 25వ తేదీ నుంచి బిస్కెట్ల ఉత్పత్తి ప్రారంభమైంది. బిస్కెట్లను ఉత్పత్తి చేశాక.. 7 రోజుల్లో ఆర్డర్ ఇచ్చినవారికి అందజేసింది.

 130 ఫ్యాక్టరీలు

130 ఫ్యాక్టరీలు

దేశంలో పార్లే జీ కంపెనీకి 130 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో 120 యూనిట్లలో బిస్కెట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో 10 ఫ్యాక్టరీలు మాత్రం సంస్థకు చెందినవి ఉన్నాయి. పార్లే జీ సంస్థ కిలోకు రూ.100 కన్నా తక్కువకు విక్రయిస్తోంది. ఇదీ కంపెనీ ఆదాయంలో మూడింట ఒక వంతు కలిగి ఉంది. విక్రయించిన వాటా 50 శాతం వరకు ఉంది.

English summary

8 దశాబ్దాల్లో రికార్డ్ సేల్స్: లాక్ డౌన్ సమయంలో పార్లే జీ విక్రయాలు ఫుల్, ఎందుకంటే..? | Parle-G records its best-ever sales in its 8 decades during lockdown

Biscuit brand Parle-G, a household name since 1938, has achieved a unique feat of selling the most amount of biscuits during this COVID-19 lockdown across the country.
Story first published: Wednesday, June 10, 2020, 12:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X