మరిచిపోకండి... పాన్-ఆధార్ లింక్‌కు 31 డెడ్‌లైన్ లేదంటే పాన్ పనిచేయదు
పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించుకోవడం తప్పనిసరి అని ఆదాయపు పన్ను శాఖ విభాగం మరోసారి సూచించింది. ఇందుకు మార్చి 31వ తేదీ తుది గడువు అని సోమవారం తెలిపింది. గడువు లోపల పాన్-ఆధార్ లింక్ చేసుకోని పక్షంలో పాన్ కార్డు పని చేయదని గత నెలలోనే ఐటీ డిపార్టుమెంట్ హెచ్చరించింది.
బయో మెట్రిక్ ధ్రవీకరణ, ఎన్ఎస్డీఎల్, యూటీఐటీఎస్ఎల్ పాన్ సేవా కేంద్రాల ద్వారా కూడా అనుసంధానం చేసుకోవచ్చునని ఐటీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. రెండు మార్గాల్లో లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయవచ్చునని పేర్కొంది.

PAN-Aadhaar link: మార్చి 31లోగా లింక్ చేయకుంటే భారీ షాక్, మళ్లీ అప్లై చేయొద్దు..
ఆధార్ కార్డును ఎస్సెమ్మెస్ ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు. అలాగే ఆదాయపు పన్ను శాఖ ఈృఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ పాన్-ఆధార్ లింక్ కోసం పలుమార్లు గడువులు ఇచ్చింది. ఈసారి గడువు పెంపొందించే అవకాశాలు లేవు. కాబట్టి ముందే లింక్ చేసుకోవడం మంచిది.