For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.20 లక్షలకు మించి డిపాజిట్ చేసినా, తీసుకున్న పాన్, ఆధార్ తప్పనిసరి

|

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్ లేదా ఉపసంహరణలకు పాన్ కార్డు లేదా ఆధార్ కార్డును అందించాలని కేంద్ర ప్రత్యక్ష పన్ుల బోర్డు కొత్త నియమాలను తీసుకు వచ్చింది. ఈ కొత్త నిబంధనలు మే 26వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. సీబీడీటీ నోటిఫికేషన్ ప్రకారం అధిక మొత్తంలో బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వారు లేదా కరెంట్ లేదా క్యాష్ క్రెడిట్ ఖాతాలను తెరిచేవారు పాన్ లేదా ఆధార్‌ను తప్పనిసరిగా వెల్లడించాలి.

ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాలు లేదా పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.20 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినా లేదా ఉపసంహరించినా ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ.20 లక్షలు డిపాజిట్ లేదా ఉపసంహరించుకున్నా లేదా విడివిడిగా చేసినా ఈ నిబంధనలు వర్తిస్తాయి. పాన్ కార్డు లేని వారు ఆధార్ నెంబర్ ఇవ్వవచ్చు.

PAN, Aadhaar mandatory for transactions of ₹20 lakh

నగదు ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి ఈ కొత్త రూల్స్‌ను అమలు చేయడానికి ఆదాయపు పన్ను నిబంధనలు, 1962లో సవరణలు చేసింది సీబీడీటీ. అధిక మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నవారు, ట్రాన్సాక్షన్స్ చేసే ఏడు రోజుల ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

English summary

రూ.20 లక్షలకు మించి డిపాజిట్ చేసినా, తీసుకున్న పాన్, ఆధార్ తప్పనిసరి | PAN, Aadhaar mandatory for transactions of ₹20 lakh

Banking rule change from today. PAN, Aadhaar mandatory for cash transactions of ₹20 lakh or more.
Story first published: Thursday, May 26, 2022, 17:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X