For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా కంపెనీల ముందు చేతులెత్తేసిన శాంసంగ్! టాప్ ఉద్యోగులు సహా వందల ఉద్యోగాల కోత?

|

టాప్ సాఫ్టువేర్ కంపెనీల్లో ఇటీవలి వరకు వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగించిన వార్తలు తెలిసిందే. తాజాగా, స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ కూడా తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే పనిలో పడిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో ఆర్థిక మందగమనం కనిపిస్తోంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో శాంసంగ్ ఇండియా ఉద్యోగాల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

గత ఏడాది ఉద్యోగాల కోతకు సంబంధించిన కథనాలు

100 మంది ఉద్యోగులు, ఇద్దరు టాప్ ఆఫీసర్లు

100 మంది ఉద్యోగులు, ఇద్దరు టాప్ ఆఫీసర్లు

శాంసంగ్ ఇండియా 100 మంది వరకు ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగుల తొలగింపుతో పాటు ఇద్దరు టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్ ఇప్పటికే రిజైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రంజీవిజత్ సింగ్, డివిజనల్ బిజినెస్ హెడ్ సుఖేష్ జైన్ రాజీనామా చేశారని ఇంగ్లీష్ మీడియా పేర్కొంటోంది. అయితే ఉద్యోగాల తొలగింపు, టాప్ ఆఫీసర్ల రాజీనామాను కంపెనీ ప్రకటించాల్సి ఉంది.

టాప్ సేల్ షియోమీలో ఉద్యోగులు 700

టాప్ సేల్ షియోమీలో ఉద్యోగులు 700

మొబైల్ ఫోన్ల తయారీ ఇండస్ట్రీలో సాధారణంగా జాబ్ కట్ చాలా అరుదు. కానీ శాంసంగ్ ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని, ఇప్పటికే ఆ పరిశ్రమలో చాలా వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో తయారీదారులకు అప్పచెబుతున్నాయని అంటున్నారు. అదే సమయంలో ఇండియాలో ఎక్కువగా అమ్ముడయ్యే షియోమీ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 700కు మించి లేరని అంటున్నారు.

చైనా కంపెనీలతో శాంసంగ్‌కు గట్టి పోటీ

చైనా కంపెనీలతో శాంసంగ్‌కు గట్టి పోటీ

గత కొన్నాళ్లుగా శాంసంగ్ ఇండియాలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇదివరకు ఇండియాలో టాప్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ శాంసంగ్‌దే. ఇప్పుడు దానిని షియోమీ ఆ ప్లేస్‌ను ఆక్రమించింది. చైనా మొబైల్ కంపెనీల నుంచి శాంసంగ్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. తక్కువ ధరకు, ఎక్కువ ఫీచర్లు ఉండటంతో వినియోగదారులు అటువైపు మొగ్గు చూపుతున్నారు.

సగానికి పైగా పడిపోయిన శాంసంగ్ సేల్స్

సగానికి పైగా పడిపోయిన శాంసంగ్ సేల్స్

2016 వరకు శాంసంగ్ మొదటి స్థానంలో ఉంది. ఆ ఏడాదిలో షియోమీ టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. అంతేకాదు, 2018 ఆర్థిక సంవత్సరంలో శాంసంగ్ సేల్స్ రూ.3,713 కోట్ల నుంచి 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.1,540 కోట్లకు పడిపోయాయి. అంటే సేల్స్ ఏకంగా 59 శాతం పడిపోయాయి.

రూ.30,000 హ్యాండ్‌సెట్స్ భారీగా పడిపోయాయి..

రూ.30,000 హ్యాండ్‌సెట్స్ భారీగా పడిపోయాయి..

భవిష్యత్తులోను చైనా కంపెనీలతో శాంసంగ్‌కు గట్టి పోటీనే ఉంటుంది. 2016లో టాప్ స్లాట్ కోల్పోయిన శాంసంగ్ ఇప్పటి వరకు దానిని చేరుకోవడం కాదు.. సేల్స్ అంతకంతకు పడిపోతున్నాయి. గత రెండేళ్ల కాలంలో రూ.30,000 ధర కలిగిన హ్యాండ్‌సెట్స్ సేల్స్‌లో శాంసంగ్.. వన్‌ప్లస్, యాపిల్ తర్వాత నిలవడం గమనార్హం.

టాప్ సేల్స్ ఇవే..

టాప్ సేల్స్ ఇవే..

ప్రస్తుతం ఇండియాలో సేల్స్‌లో షియోమీ టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత శాంసంగ్ రెండో స్థానం, వివో మూడో స్థానం, ఒప్పో నాలుగో స్థానంలో ఉంది. 2017లో రెండు కంపెనీలు తమ ఉద్యోగుల్లో 400 మందిని చైనాకు పంపించాయి. ఎందుకంటే సేల్స్ 30 శాతం పడిపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నాయి. అదే ఏడాది వివో నోయిడా ప్లాంటులో 100 మంది ఉద్యోగులను తొలగించింది.

English summary

చైనా కంపెనీల ముందు చేతులెత్తేసిన శాంసంగ్! టాప్ ఉద్యోగులు సహా వందల ఉద్యోగాల కోత? | Once a market leader, Samsung India lays off again in a tough market

Amid falling profit and tough market conditions, Samsung Electronics is cutting the flab. Its new realignment exercise may make over a hundred people redundant. Once the market leader, Samsung had already resorted to such exercise once earlier in the year.
Story first published: Wednesday, January 8, 2020, 10:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X