For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Job In UK: విదేశీ కలలు కనే వారికి గుడ్ న్యూస్.. భారత డిగ్రీతో UKలో ఉద్యోగం.. రెండు దేశాల అంగీకారం..

|

Job In UK: విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనేది చాలా మంది భారతీయుల కల. అయితే ఇందుకు అనేక అడ్డంకులు, ఇబ్బందులు ఉంటుంటాయి. వాటిలో ఒకటి మన దేశంలో పూర్తి చేసిన డిగ్రీకి విదేశాల్లో ఉండే గుర్తింపు. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం చొరవతో యూకేలో మన విద్యార్థులకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కుదిరిన ఒప్పందం..

కుదిరిన ఒప్పందం..

పరస్పరం రెండు దేశాల్లోని డిగ్రీలను సమానమైనవిగా గుర్తించడానికి గురువారం UK,భారత్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాలు సంతకం చేశాయి. ఇకపై విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు ఈ ఒప్పందం అపరిమితమైన అవకాశాలను కల్పించనుంది. వారి విద్యకు అనుగుణంగా యూకేలో మంచి ఉద్యోగ అవకాశాలు పొందటం ఇకపై సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ డిగ్రీలకు సమాన హోదా..

ఈ డిగ్రీలకు సమాన హోదా..

ఈ ఒప్పందం ప్రకారం.. భారతీయ విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లు ఉన్నత చదువులు అభ్యసిస్తున్న లేదా UKలో ఉద్యోగం కోరుకునేవారు UK డిగ్రీ హోల్డర్‌లతో సమానంగా ఉంటారు. అంటే..రెండు దేశాలు ఇప్పుడు ఒకరి విద్యా సంస్థల నుంచి కొన్ని బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టోరల్ కోర్సులను పరస్పరం సమానమైనవిగా గుర్తిస్తాయి. ఇండియన్ సీనియర్ సెకండరీ స్కూల్ /ప్రీ-యూనివర్శిటీ సర్టిఫికెట్లు ఇప్పుడు UK ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశానికి అర్హత పొందాయి.

ఏ డిగ్రీలకు వర్తించదంటే..

ఏ డిగ్రీలకు వర్తించదంటే..

మెడిసిన్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీలో ప్రొఫెషనల్ డిగ్రీలు ప్రస్తుతం ఒప్పందం నుంచి మినహాయించబడ్డాయి.అయితే.. వీటిని కూడా ఒప్పందం పరిధిలోకి చేర్చేందుకు భారత్ చర్చలు జరుపుతోందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.

కొత్త ప్రధాని రాకతో అమలు..

కొత్త ప్రధాని రాకతో అమలు..

రెండు దేశాలు జనవరి నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) గురించి చర్చలు జరుపుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి చర్చలు ముగుస్తాయి. ఈ తాజా ఒప్పందం UKకి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. భారత ఔత్సాహిక అంతర్జాతీయ విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉద్యోగుల సరఫరా కొరతను పరిష్కరిస్తుంది. UKలో ప్రస్తుతం కొత్త ప్రధాని ఎన్నిక జరగుతున్నందున.. ప్రధాన మంత్రిగా ఎవరు వచ్చినా FTA అమలులో ఉంటుందని సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు.

Read more about: jobs united kingdom india degree
English summary

Job In UK: విదేశీ కలలు కనే వారికి గుడ్ న్యూస్.. భారత డిగ్రీతో UKలో ఉద్యోగం.. రెండు దేశాల అంగీకారం.. | Now you can get a job in the UK with an Indian degree know full details

indian degree holders can get job in uk now as two governments agreed and made mou on this know full details
Story first published: Saturday, July 23, 2022, 13:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X