సాధారణంగా ఉద్యోగులకు, వర్కర్స్‌కు... ఎవరికైనా వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది. ఐటీ ఇండస్ట్రీ వచ్చాక రెండు రోజులు సెలవులు కూడా వచ్చాయి. కొన్ని దేశాల్లో లేదా కొన్ని కంపెనీల్లో లేదా కొన్ని రంగాల్లో వారానికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. వారంలో ఎన్ని ఎక్కువ రోజులు సెలవులు ఉంటే అంతగా ఆనందించేవారు ఎందరో. అయితే తాజాగా ఫిన్‌లాండ్ దేశంలో వీటన్నింటికి మించిన బంపరాఫర్ ఇస్తోంది.

వారంలో 4 రోజులు సెలవులు, రోజుకు 6 గంటలు వర్కింగ్
వారానికి ఒక రోజు సెలవు ఉన్నా లేదా రెండు రోజులు సెలవులు ఉన్నా (అంటే 5 రోజులు లేదా 6 రోజులు వర్కింగ్ డేస్) ప్రతి రోజు 8 గంటల నుంచి తొమ్మిది గంటలు పని చేయాల్సి ఉంటుంది. కానీ ఫిన్‌లాండ్ దేశం మాత్రం మూడు రోజులు సెలవు దినాలు ఉండాలని చెబుతోంది. అంతేకాదు, వర్కింగ్ డేస్ ఉన్న 4 రోజులు కూడా ప్రతి రోజు 6 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.

అందుకే ఈ ప్రతిపాదన
ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఇటీవలే సనా మారిన్ (34) రికార్డ్ సృష్టించారు. ఫిన్‌లాండ్ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కేటాయించేలా, తమకు ఉన్న హాబీ మేరకు ఎక్కువగా నడుచుకునేలా ఆమె ఈ ప్రతిపాదన చేశారు.

అంతకుముందు ప్రయోగం చేసి.. సక్సెస్
ప్రజలు తాము ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం సమయం కేటాయించేందుకు అర్హులని, మన ఉద్యోగ జీవితంలో ఇది మరో ముందడుగు కావాలని సనా మారిన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా వారంలో 4 రోజులు, 6 గంటల వర్కింగ్ హవర్స్ ప్రతిపాదించారు. అమె అంతకుముందు ట్రాన్సుపోర్ట్ మినిస్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో తన శాఖ ఉద్యోగులపై ఈ ప్రయోగం చేశారు. దీంతో ఉద్యోగులు ఉత్సాహంగా పని చేయడంతో పాటు ప్రోడక్టివిటీ పెరిగింది. ఇదే విషయాన్ని ఆమె చెప్పారు.

ఫిన్‌లాండ్ కంటే ముందు స్వీడన్
ప్రస్తుతం ఫిన్‌లాండ్‌లో 5 రోజులు, 8 గంటల వర్కింగ్ హవర్స్ ఉన్నాయి. కాగా అంతకుముందు 2015లో స్వీడన్ 6 గంటల వర్కింగ్ హవర్స్‌ను తీసుకు వచ్చింది. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు.

ఫిన్‌లాండ్ పౌరసత్వం ఇవ్వండి.. మోడీ గారూ.. అలా చేయండి
కాగా, ఫిన్‌లాండ్‌లో వారానికి 4 రోజులు, 6 గంటల వర్కింగ్ హవర్స్ పైన ఇండియాలోని నెటిజన్లు చాలామంది తమదైన స్టైల్‌లో స్పందించారు. కొంతమంది నెటిజన్లు సరదాగా ప్రధాని సనా మారిన్‌ను ఫిన్‌లాండ్ సిటిజన్‌షిప్ కోరారు. ఫిన్‌లాండ్ పౌరసత్వం ఎలా తీసుకోగలమని, నేను ఫిన్‌లాండ్ వెళ్తున్నానని ట్వీట్ చేశారు. మరికొంతమంది ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications