For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం, భారత్‌లోకి నోకియా స్మార్ట్ టీవీలు

|

మొబైల్ సంస్థ మోటరోలాను కొనుగోలు చేసిన నోకియా ఇప్పుడు స్మార్ట్ టీవీల విభాగంలోకి కూడా అడుగుపెడుతోంది. ఇందుకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో జత కట్టింది. భారత్‌లో నోకియా స్మార్ట్ టీవీలను లాంచ్ చేసేందుకు బుధవారం నోకియా-ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వినియోగదారుల రంగంలో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకునే ఉద్దేశంలో భాగంగా నోకియా బ్రాండ్‌తో టీవీల్ని త్వరలో అందుబాటులోకి రానుంది.

బిగ్గెస్ట్ షాపింగ్ సీజన్.. కానీ అంచనాలు తారుమారుబిగ్గెస్ట్ షాపింగ్ సీజన్.. కానీ అంచనాలు తారుమారు

దేశీయ కస్టమర్ల కోరుకునేవిధంగా టీవీలను తీర్చిదిద్దనుంది. ఇందుకు ప్రత్యేక తయారీ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఎన్ని మోడల్స్, ధరలు, విడుదల తేదీ వివరాలు వెల్లడించాల్సి ఉది. స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్న వివిధ కంపెనీలు స్మార్ట్ టీవీల విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. శాంసంగ్‌, మైక్రోమాక్స్‌, ఇంటెక్స్‌, షియోమీ, మోటరోలా, వన్ ప్లస్ టీవీలు వచ్చాయి.

Nokia branded smart tvs announced by flipkart, will be made in india

భారత కస్టమర్ల అవసరార్థం దేశీయంగా నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టీవీల అభివృద్ధి, పంపిణీని సులభతరం చేసేందుకు, ఎండ్ టు ఎండ్, గో టు మార్కెట్ వ్యూహాన్ని నిర్వహించేందుకు ఫ్లిప్‌కార్ట్ పని చేయనుంది. దీని ద్వారా కొన్ని వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అత్యాధునిక సౌండ్ నాణ్యత కోసం జేబీఎల్ సౌండ్ సిస్టంను ఉపయగిస్తుంది. ఇందుకు జేబీఎల్‌తో ఒప్పందం కుదిరింది.

భారత్‌లో 32 ఇంచెస్ నుంచి నుంచి 65 ఇంచెస్ కలిగిన స్మార్ట్ టీవీల ధరలు రూ.13,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ఒకటైన నోకియాతో జతకట్టడంతో దేశీయంగా అత్యంత వేగంగా దూసుకుపోతున్న ప్రొడక్ట్ విభాగంలో ప్రవేశించడం మంచి పరిణామమని ఫ్లిప్‌కార్ట్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆదర్శ్ మీనన్ తెలిపారు.

English summary

ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం, భారత్‌లోకి నోకియా స్మార్ట్ టీవీలు | Nokia branded smart tvs announced by flipkart, will be made in india

Flipkart has announced that it has entered into a strategic partnership with Nokia to launch Nokia-branded Smart TVs in India.
Story first published: Thursday, November 7, 2019, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X