For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2020: వెల్త్ ట్యాక్స్‌కు సమయం వచ్చిందా... కానీ?

|

మరో మూడు రోజుల్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమయంలో నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ మోడీ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ధనికులకపై అధిక ట్యాక్స్ విధించాలన్నారు. తద్వారా అసమానతలపై పోరాటం చేయాలన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందన్నారు. మందగమనంలో ఉన్న వృద్ధిని పట్టాలు ఎక్కించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు..

వెల్త్ ట్యాక్స్ ద్వారా అసమానతలు తగ్గించాలి

వెల్త్ ట్యాక్స్ ద్వారా అసమానతలు తగ్గించాలి

పెరుగుతున్న అసమానతలు, ముఖ్యంగా గ్రామీణ భారతంలో తగ్గిన వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర బడ్జెట్‌లో చర్యలు చేపట్టాలని అభిజిత్ బెనర్జీ అన్నారు. ఈ బడ్జెట్లో దేశంలోని సంపన్నులపై వెల్త్ ట్యాక్స్ ద్వారా అసమానతలు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. తద్వారా అసమానతలు తగ్గించే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడ్డారు.

వెల్త్ ట్యాక్స్‌కు ఇదే సమయం

వెల్త్ ట్యాక్స్‌కు ఇదే సమయం

ప్రస్తుతం భారత్‌లోని అసమానతలను చూస్తే వెల్త్ ట్యాక్స్ అనేది ఏమాత్రం తప్పు కాదని, ఇది ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. వెల్త్ ట్యాక్స్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఇదే సమయం అన్నారు. ఇలా వచ్చిన పన్ను ఆధాయాన్ని పేదలకు పంచడం ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించవచ్చునని చెప్పారు.

పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు

పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు

కానీ ఇప్పుడు ఇది జరుగుతుందని తాను భావించడం లేదని అభిజిత్ బెనర్జీ అన్నారు. భారత్ సహా అన్ని దేశాలు పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నాయని, కాబట్టి వెల్త్ ట్యాక్స్ త్వరగా ఊహించలేమన్నారు.

English summary

Budget 2020: వెల్త్ ట్యాక్స్‌కు సమయం వచ్చిందా... కానీ? | Nobel awardee Abhijit Banerjee wants this tax on wealthy to fight inequality

Amid rising inequality and fall in consumption especially in the rural sector, Nobel Laureate Abhijit Banerjee reiterated his strategy to alleviate poverty by reimposing Wealth tax on the country’s richest population in the upcoming union budget and following with redistribution of the wealth.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X