For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పవర్ డిస్ట్రిబ్యూషన్‌లో ఆరోగ్యకరమైన పోటీకి.. నీతి అయోగ్ యత్నం

|

రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలో ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించేందుకు స్టేట్ ఎనర్జీ ఇండెక్స్ పైన నితి ఆయోగ్ పనిచేస్తోందని నితి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. శక్తి వనరులను సమర్థవంతంగా నిర్వహించేందుకు, రాష్ట్రాల పనితీరును అంచనా వేయడానికి, మరింత మెరుగుపరిచడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. 'స్టేట్ ఎనర్జీ ఇండెక్స్ పైన నితి ఆయోగ్ పని చేస్తోంది. ఇది రాష్ట్రాల ఎనర్జీ డిస్క్‌లో ఆరోగ్యకర పోటీని పెంపొందించేందుకు సిద్ధంగా ఉంది' అన్నారు.

 తొలిసారి హెటెరో ఫెవిపిరవిర్ 800ఎంజీ ట్యాబ్లెట్, ధర రూ.2,640 తొలిసారి హెటెరో ఫెవిపిరవిర్ 800ఎంజీ ట్యాబ్లెట్, ధర రూ.2,640

ఇదిలా ఉండగా, ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం గణనీయ వృద్ధి సాధిస్తోంది. గత అయిదేళ్లలో 64 శాతం వృద్ధిని నమోదు చేసింది. రాష్ట్రం నుంచి 1.80 లక్షల కోట్ల విలువైన వివిధ రకాల వస్తువులు, ఐటీ ఎగుమతులు ప్రపంచంలోని దాదాపు 190 దేశాలకు సరఫరా అవుతున్నాయి. దేశీయ ఎగుమతుల్లో 70% పైగా వాటా కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతుల సన్నద్ధత సూచీ 2020 ర్యాంకుల్లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది.

NITI working on index to foster competition in power distribution

2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుండి రూ.1.10 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. 2019-20 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.1.80 లక్షల కోట్లకు పెరిగాయి. ఎగుమతుల ప్రోత్సాహక విధానం, వ్యవస్థాగత నిబంధనలు, వాణిజ్యపరంగా ఉన్న సానుకూల వాతావరణం, మౌలిక వసతులు, రవాణా అనుసంధానం, ద్రవ్యలభ్యత, మౌలిక వసతులు, వాణిజ్య మద్దతు వంటి వాటిలో రాష్ట్రం ముందు ఉంది.

English summary

పవర్ డిస్ట్రిబ్యూషన్‌లో ఆరోగ్యకరమైన పోటీకి.. నీతి అయోగ్ యత్నం | NITI working on index to foster competition in power distribution

Niti Aayog has been working on a State Energy Index that is set to foster healthy competition in the states' power distribution space, the think tank's Vice-Chairman, Rajiv Kumar, said on Saturday.
Story first published: Sunday, September 27, 2020, 19:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X