For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రంప్‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ షాక్, ఆ 3 చైనా కంపెనీలకు భారీ ఊరట

|

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్(NYSE) షాకిచ్చింది. చైనాకు చెందిన మూడు టెలికం సంస్థలను ఇండెక్స్ నుండి తొలగించే ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై యూటర్న్ తీసుకుంటోంది. ఈ మేరకు ప్రకటన చేసింది. మూడు చైనీస్ కంపెనీలను తొలగించే ప్రణాళికపై ముందుకు సాగబోమని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ స్పష్టం చేసింది. రెగ్యులేటర్లతో తదుపరి సంప్రదింపుల అనంతరం తమ మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తన వెబ్ సైట్‌లో పేర్కొంది.

4 రోజుల్లో యూటర్న్

4 రోజుల్లో యూటర్న్

నవంబర్ నెలలో జారీ చేసిన ట్రంప్ ఆదేశాల మేరకు చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా టెలికం కార్ప్ లిమిటెడ్, చైనా మొబైల్ లిమిటెడ్, చైనా యూనికామ హాంగ్ కాంగ్ లిమిటెడ్ సంస్థలను NYSE నుండి డీ-లిస్టింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ సంస్థలకు చైనా మిలిటరీతో లింక్స్ ఉన్నట్లు తెలిపింది. అయితే నాలుగు రోజుల్లోనే తన నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. నియంత్రణ సంస్థలతో తదుపరి చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

తొక్కి పెడుతున్నారు

తొక్కి పెడుతున్నారు

NYSE స్టాక్ ఎక్స్చేంజ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి ముందు చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల చైనా కంపెనీలపై తక్కువ ప్రభావం పడుతుందని, అయితే అమెరికా జాతీయ ప్రయోజనాలను, ప్రతిష్టను దెబ్బతీస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ కంపెనీలను తొక్కి పెడుతున్నారన్నారు.

షేర్ల జూమ్

షేర్ల జూమ్

న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్... చైనీస్ కంపెనీలను డీ-లిస్టింగ్ చేయడం లేదని ప్రకటించిన నేపథ్యంలో ఆ మూడు కంపెనీల షేర్లు జంప్ చేశాయి. ఈ షేర్లు 5 శాతం నుండి 11 శాతం వరకు ఎగిశాయి.

English summary

ట్రంప్‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ షాక్, ఆ 3 చైనా కంపెనీలకు భారీ ఊరట | New York Stock Exchange does a U turn on Chinese telecoms delistings

The New York Stock Exchange (NYSE) has scrapped its decision to delist three Chinese telecoms companies.
Story first published: Wednesday, January 6, 2021, 7:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X