రూ.20 లక్షల నగదు ఉపసంహరణపై టీడీఎస్, రేటు నిర్ణయం ఇక మరీ ఈజీ
పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణలపై విధించే మూలం వద్ద పన్ను(TDS) రేటు నిర్ణయం మరింత ఈజీ కానుంది. బ్యాంకులు, పోస్టాఫీస్‌ల కోసం ప్రత్యేక సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఆదివారం ప్రకటించింది ఆదాయపు పన్ను శాఖ (IT డిపార్టుమెంట్). ప్రస్తుతం ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తి రూ.20 లక్షలకు మించి, ఇతరులు రూ.ఒక కోటికి మించి పైగా నగదు ఉపసంహరిస్తే టీడీఎస్ రేటు వర్తిస్తుంది.
టాటా మోటార్స్ బంపరాఫర్, 6నెలలు ఈఎంఐ లేకుండా కారు కొనొచ్చు

పాన్ వివరాలు నమోదు చేస్తే... టీడీఎస్ రేటు
ఇక నుండి నగదు ఉపసంహరించే వ్యక్తి పాన్ వివరాలు నమోదు చేస్తే, వెంటనే టీడీఎస్ రేటు సందేశం కనిపిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆప్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) తెలిపింది. ఐటీఆర్ దాఖలు చేసే వ్యక్తి రూ.కోటికి మించి నగదును ఉపసంహరిస్తే 2 శాతం టీడీఎస్ ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయని వారు రూ.20 లక్షలు మించి ఉపసంహరిస్తే 2 శాతం, రూ.కోటికి మించి ఉపసంహరిస్తే రూ.5 శాతం మేర పన్ను విధిస్తారు.

వారి పేర్లపై భారీ నగదు ఉపసంహరణ..
బ్యాంకులు, పోస్టాఫీస్‌లు సంబంధిత ఖాతాదారు పాన్ నెంబర్ ఎంటర్ చేస్తే వారి వెబ్ సైట్ పైన ఒక మెసేజ్ కనిపిస్తుంది. దాని ప్రకారం టీడీఎస్ మినహాయిస్తే చాలు. ఐటీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారి పేర్ల మీద భారీగా నగదు ఉపసంహరణలు జరుగుతున్నట్లు వెల్లడైన నేపథ్యంలో జూలై 1వ తేదీ నుండి ఇది అమల్లోకి వచ్చేలా సీబీడీటీ సదుపాయం కల్పించింది. అంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.కోటికి మించి ఉపసంహరిస్తే, రిటర్న్స్ దాఖలు చేయకుంటే రూ.20 లక్షలకు మించి ఉపసంహరిస్తే టీడీఎస్ రేటు వర్తిస్తుంది.

ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్లో
ఐటీ శాఖ వెబ్ సైట్ www.incometaxindiaefiling.gov.in లో వెరిఫికేషన్ ఆఫ్ అప్లికబిలిటీ u/s 194ఎన్ ద్వారా ఇది అందుబాటులో ఉందని సీబీడీటీ తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ సవరణ ప్రకారం జూలై 1, 2020నుండి నాన్-ఫైలర్స్‌కు టీడీఎస్ వర్తించే నగదు ఉపసంహరణ పరిమితిని రూ.20 లక్షలకు తగ్గించారు. సీబీడీటీ... బ్యాంకులు, పోస్టాఫీస్‌లకు అందించిన ఈ కొత్త సదుపాయంపై 53,000కు పైగా వెరిఫై చేయగా సక్సెస్ అయ్యాయని తెలిపింది.