For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికాలో చదివితేనే H1B వీసాలో ప్రాధాన్యత: బిల్లులో కీలక అంశాలు, మనపై ప్రభావం ఎలా?

|

అమెరికా ప్రభుత్వం H1B, L1 వీసాల్లో కీలక సంస్కరణలకు తెరలేపింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడుతూ ఆ దేశంలో చదువుకున్న విదేశీ యువతకు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా బిల్లును రూపొందించారు. H1B, L1 వీసా సంస్కరణల చ్టం పేరుతో ఈ బిల్లును రెండు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం సభల్లో ప్రవేశ పెట్టింది. దీని ద్వారా అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వారికి హెచ్1బీ వీసా మంజూరు చేస్తారు.

ఓ వైపు సామాన్యుల కష్టాలు: బెజోస్, జుకర్, మస్క్ సహా వారి ఆస్తులను భారీగా పెంచిన కరోనా!

అమెరికాలో చదివే ఇండియన్స్‌కు ప్రయోజనం

అమెరికాలో చదివే ఇండియన్స్‌కు ప్రయోజనం

అలాగే, ఉన్నతవిద్యను అభ్యసించినవాళ్లు, అధిక వేతనాలకు పనిచేసే నైపుణ్యం ఉన్నవారికి వీసా మంజూరు చేసేలా సంస్కరణలు ఉన్నాయి. దీని వల్ల ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత స్థానం ఇండియాదే. భారత్ నుండి 2 లక్షలమందికి పైగా విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారు.

అదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం

అదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం

ఈ బిల్లు ప్రకారం అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకే హెచ్1బీ వీసా జారీలో తొలి ప్రాధాన్యత ఉంటుంది. దీంతో అమెరికాలో విద్యను అభ్యసించిన భారతీయులు సహా వివిధ దేశాలకు చెందినవారు ఎక్కువ సంఖ్యలో అక్కడ సేవలు అందించేందుకు వెసులుబాటు ఉంటుంది. అర్హులైన అమెరికన్లను పక్కనబెట్టి ఇతర దేశాల వారిని ఉద్యోగాల్లోకి తీసుకోకుండా నిరోధించడం అలాగే, మరింత ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యంగా చెబుతున్నారు.

మనకు ప్రయోజనం.. అదే సమయంలో..

మనకు ప్రయోజనం.. అదే సమయంలో..

అమెరికాలో చదువుకుంటున్న విదేశీయుల్లో చైనా తర్వాత ఇండియన్స్ ఎక్కువ. దీంతో భారతీయులకు కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం హెచ్1బీ వీసాల్లో మూడొంతులు భారతీయులకే దక్కుతున్నాయని, దీంతో కొత్త చట్టం ద్వారా జరిగే నష్టం కూడా మనకే అధికంగా ఉండే అవకాశముందని అంటున్నారు. అమెరికాలో చదువుకునే విదేశీయుల వల్ల అమెరికన్ విద్యా సంస్థలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది.

బిల్లులో ముఖ్యాంశాలు

బిల్లులో ముఖ్యాంశాలు

ఈ బిల్లు ప్రకారం అమెరికా ఉద్యోగులను తొలగించిన వారి స్థానంలో హెచ్1బీ, ఎల్1 వీసాదారులకు ఉద్యోగం ఇవ్వరాదు.

అమెరికాలో చదువుకున్న చురుకైన విదేశీ విద్యార్థులకు హెచ్1బీ వీసాల జారీలో ప్రాధాన్యం.

ఔట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్1బీ, ఎల్1 వీసాల ద్వారా విదేశాల నుండి ఉద్యోగులను రప్పించి, వారికి కొంతకాలం శిక్షణ ఇప్పించి, ఆ తర్వాత వారి సొంత దేశం నుండి పని చేయిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలి.

యాభై మంది ఉద్యోగులు దాటిన కంపెనీల్లో ఇప్పటికే హెచ్1బీ ఎల్1 వీసాల ద్వారా వచ్చిన ఉద్యోగులు సగం కంటే ఎక్కువ ఉంటే అదనంగా హెచ్1బీ, ఎల్1 వీసాల కింద తీసుకోరేదు.

అమెరికా కార్మిక శాఖకు ఉద్యోగ డేటా ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం.

వేతన షాక్

వేతన షాక్

ఎల్1 ఉద్యోగాలకు కనీస వేతనం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఉద్యోగుల ఎంపికను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. హెచ్1బీ వీసాదారులకు కనీస వేతనాన్ని 1.50 లక్షల డాలర్లకు పెంచాలని అమెరికా యోచిస్తోంది. ప్రస్తుతం వీరికి సగటున 70వేల నుండి 90వేల డాలర్లు మధ్య ఉంది. అంటే రూ.53 లక్షల నుండి రూ.68 లక్షల మధ్య ఉంది. దీనిని ఇప్పుడు 1.50 లక్షల డాలర్లు (రూ.1.13 కోట్లు) నుండి 2.50 లక్షల డాలర్లుగా (రూ.1.90 కోట్లు) చేయనున్నారు. ఇది అమల్లోకి వస్తే కంపెనీలు జీతం రెట్టింపు ఇవ్వాల్సి ఉంటుంది.

తెలుగు వారిపై ప్రభావం

తెలుగు వారిపై ప్రభావం

అమెరికా నిర్ణయంతో తెలుగువారిపై ప్రభావం కూడా ఉంటుంది. అమెరికా కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంది. తాజా బిల్లు చట్టంగా మారక తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

English summary

New H1B legislations in US Congress to give priority to US educated foreign workers

A bipartisan group of lawmakers introduced a legislation in both the chambers of the US Congress proposing major reforms in skilled non-immigrant visa programmes by giving priority to US-educated foreign technology professionals in issuing H-1B work visas.
Story first published: Sunday, May 24, 2020, 21:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X