For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఛార్జీలు జీరో కావాలి: నందన్ నీలేకని, Fastagపై మరో సూచన

|

మర్చంట్ డిస్కౌంట్ ఛార్జీలు (MDR) ప్రభుత్వ జోక్యం లేకుండానే జీరో కావాల్సి ఉందని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అన్నారు. ప్రభుత్వ జోక్యం లేకపోయినా దేశీయ పేమెంట్ సంస్థలు చౌక చెల్లింపు విధానాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇవి చిన్న వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.

భూటాన్‌లో పర్యటిస్తున్నారా? జూలై నుంచి రూ.1,200 చెల్లించాలి!భూటాన్‌లో పర్యటిస్తున్నారా? జూలై నుంచి రూ.1,200 చెల్లించాలి!

అప్పుల ద్వారా ఆదాయం ఏర్పాటు చేసుకోవాలి

అప్పుల ద్వారా ఆదాయం ఏర్పాటు చేసుకోవాలి

MDR ఛార్జీలు పూర్తిగా తొలగిస్తారని అనుకుంటున్నానని, ప్రభుత్వం జోక్యం లేకపోయినప్పటికీ ఇది జరగాలని నందన్ నీలేకని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ జోక్యం లేకపోయినా ఇది జరగాలని, ఆన్‌లైన్‌లోనే కాదు.. ఆఫ్‌లైన్‌లో కూడా చౌకగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. అప్పులు ఇవ్వడంవంటి ఇతర మార్గాల్లో ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Fastagపై సూచన

Fastagపై సూచన

UPIని తప్పనిసరి చేయడం మంచి మార్గమని నందన్ నీలేకని అన్నారు. UPI విషయంలో ఆకాశమే హద్దు అన్నారు. ఫాస్టాగ్ పైన కూడా ఆయన స్పందించారు. జాతీయ రహదారులపై టోల్ గేట్స్ వద్ద వాహనాలు సులభంగా వెళ్లేందుకు ఫాస్టాగ్ వ్యవస్థను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫాస్టాగ్‌ను వాహనాల ఇతర చెల్లింపులకు కూడా అనుసంధానం చేయాలని సూచించారు.

రుపే కార్డుపై ఛార్జీలు రద్దు

రుపే కార్డుపై ఛార్జీలు రద్దు

వ్యాపారులు బ్యాంకుల చెల్లింపుల వ్యవస్థను వినియోగించుకున్నందుకు MDR ఛార్జీలను వసూలు చేస్తాయి. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూపే కార్డు ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీలను రద్దు చేసిన విషయం తెలిసిందే. MDR రద్దు చేస్తే తమ వ్యాపార లాభాలు తగ్గుతాయని బ్యాంకులు అంటున్నాయి.

English summary

ఆ ఛార్జీలు జీరో కావాలి: నందన్ నీలేకని, Fastagపై మరో సూచన | Nandan Nilekani says MDR would have trended to zero even without government

Infosys Chairman Nandan Nilekani said the merchant discount rate (MDR) would have trended to zero even if the government had not gotten involved and said payment providers in India should focus on budget payments that will help small merchants across the country.
Story first published: Wednesday, February 5, 2020, 18:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X