For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

MS Dhoni retires: శాలరీ, బిజినెస్.. ధోనీ సంపద ఎంతంటే?

|

ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు ఓ పోస్ట్ చేశాడు. 'కెరీర్‌ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ధోనీ వీడ్కోలుతో అభిమానులు ఆశ్చర్యపోయారు. హఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించడంతో అభిమానుల హృదయం ముక్కలైంది.

ఊహించని విధంగా రిటైర్మెంట్‌ ప్రకటించడానికి కారణాలు వెతికే పనిలో పడ్డారు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అత్యున్నత అతను ఎన్నో సాహసాలు చేశాడు. కోట్లాది హృదయాల్లో నిలిచిన ధోనీకి క్రికెట్ ద్వారా వచ్చే వేతనంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా అంతకంటే ఎక్కువ సంపాదించాడు.

ధోనీ నెట్ వర్త్ రూ.760 కోట్లు

ధోనీ నెట్ వర్త్ రూ.760 కోట్లు

నెట్ ఆదాయం రూ.760 కోట్ల నుండి రూ.830 కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. ధోనీ వద్ద కార్లతో పాటు ప్రయివేట్ జెట్ వంటివి కూడా ఉన్నాయి. దేశంలో క్రికెట్‌ను కూడా ఓ మతంగా భావిస్తారు. ఇందులో ధోనీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకోవడమే కాదు... ప్రస్తుత కాలంలో అలాంటి ఫినిషర్ లేడనేది క్రికెట్ పండితుల మాట. అలాగే కెప్టెన్‌గా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అత్యంత ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా.. ఎప్పుడు ఎవరిని బ్యాటింగ్‌కు దించాలి, ఎప్పుడు ఎవరితో బౌలింగ్ వేయించాలి, ఫీల్డింగ్ సెట్.. ధోనీకి తెలిసినంతగా ఎవరికీ తెలియవనేది అభిమానుల మాట. కొంతకాలంగా కెప్టెన్‌గా ఉంటున్న కోహ్లీ కూడా ధోనీ సూచనలు, సలహాలు ఎక్కువగా పాటిస్తారని అంటారు.

మ్యాచ్ ఫీజు, ఎండార్స్‌మెంట్

మ్యాచ్ ఫీజు, ఎండార్స్‌మెంట్

ఎంఎస్ ధోనీకి ఐపీఎల్ శాలరీ రూ.15 కోట్లుగా ఉంది. టీ20 మ్యాచ్ ఫీజు రూ.2 లక్షలు. పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.620 కోట్లుగా ఉండగా, లగ్జరీ కార్ల వ్యాల్యూ రూ.12.5 కోట్లుగా ఉంది. ధోనీకి, కార్లు, బైక్స్ అంటే మక్కువ. ధోనీకి ఎక్కువగా వచ్చిన ఆదాయం ఎండార్స్‌మెంట్ ద్వారా వచ్చిందే. ప్రస్తుతం రిటైర్ అయినప్పటికీ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మరికొంతకాలం ఉంటాడు. అంటే మరింత కాలం ఎండార్స్‌మెంట్ ఆదాయం ఉంటుంది. ధోనీకి ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం ఉంది. అయితే ఇందులో ట్యాక్స్‌లు, ఖర్చులు కూడా ఉంటాయని గుర్తించాలి. మొత్తంగా అతని ఆదాయం రూ.760 కోట్లకు అటు ఇటుగా ఉంటుందట.

లగ్జరీ హోమ్, కార్లు, బైక్స్

లగ్జరీ హోమ్, కార్లు, బైక్స్

2011లో డెహ్రూడాన్‌లో ధోనీ లగ్జరీ హోమ్ తీసుకున్నాడు. దాని వ్యాల్యూ రూ.17.8 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇతర చాలాచోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రపంచ బెస్ట్ లగ్జరీ కార్లు ధోనీ వద్ద ఎన్నో ఉంటాయి. హమ్మర్, ఆడి, మెర్సిడెజ్, మిత్సుబిషి పెజెరో, రేంజ్ రోవర్ వంటివి ఎన్నో ఉన్నాయి. కార్లతో పాటు ధోనీ బైక్స్ కలెక్షన్స్ కూడా చేస్తాడు.

విభిన్న క్రీడల్లో సంస్థలకు సహయజమాని

విభిన్న క్రీడల్లో సంస్థలకు సహయజమాని

క్రికెట్, ఎండార్స్‌మెంట్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ధోనీ సినిమా ద్వారా కూడా వచ్చాయి. ఇటీవల ఎంఎస్‌డీ-అన్‌టోల్డ్ స్టోరీకి మంచి ఆదాయం వచ్చింది. ఇతర పెట్టుబడుల ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ వంటి విభిన్న క్రీడల్లో పలు జట్లకు సహయజమాని.

టిక్కెట్ కలెక్టర్ నుండి క్రికెట్ ఐకాన్

టిక్కెట్ కలెక్టర్ నుండి క్రికెట్ ఐకాన్

రైల్వే కలెక్టర్ ఉద్యోగం నుండి ఇండియన్ క్రికెట్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ధోనీ. అతని కెప్టెన్సీలో 2007లో టీ20 వరల్ట్ కప్, 2011లో ప్రపంచ కప్, 2013లో చాంఫియన్స్ ట్రోపీ వచ్చాయి. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు రెండుసార్లు దక్కించుకుంది ధోనీ మాత్రమే.

English summary

MS Dhoni retires: శాలరీ, బిజినెస్.. ధోనీ సంపద ఎంతంటే? | MS Dhoni Net Worth 2020 Salary, Car, Business

MS Dhoni Net Worth is Rs.760 crores. Cricket is followed as a religion in India, and players are treated as God by their fans. One such great player is Mahendra Singh Dhoni.
Story first published: Sunday, August 16, 2020, 10:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X