ఉద్యోగం బాగుంది, కానీ వేతనం ప్చ్: సర్వేలో మెజార్టీ ఉద్యోగుల అభిప్రాయం
న్యూఢిల్లీ: భారత్‌లో ఎక్కువమంది ఉద్యోగులు తమ వృత్తిపట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, వేతనం పట్ల అసంతృప్తిగా ఉన్నారట. మాన్‌స్టర్ చేసిన సర్వేలో ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తాము చేస్తున్న ఉద్యోగం సంతృప్తికరంగానే ఉందని, కానీ జీతం మాత్రం ఆశించినంతగా లేదని ఈ సర్వేలో ఎక్కువ మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. 75 శాతం మంది ఉద్యోగులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వేతన సంతృప్తి స్థాయి గతంలో కంటే తగ్గింది. అలాగే తోటి ఉద్యోగులు, ఉన్నతస్థాయి అధికారులతో ఉన్న సంబంధాల ప్టల ఉద్యోగులు ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేశారు.
నష్టం జరిగితే బాధ్యత మాది కాదు: కస్టమర్లకు SBI హెచ్చరిక

ఉద్యోగం ఓకే, వేతనం ప్చ్...
2016 జనవరి నుంచి 2018 డిసెంబర్ మధ్య మూడేళ్ల మధ్య అంశాలను క్రోడీకరించి ఈ నివేదిక తయారు చేశారు. ఉద్యోగం సంతృప్తిగా ఉందని 75 శాతం మంది చెప్పారు. కానీ వేతన సంతృప్తి 21.6 శాతం కనిష్టానికి పడిపోయింది. తోటి ఉద్యోగులు, అధికారులతో సంబంధాలు బాగున్నాయని చెప్పారు. గత ఏడాది ఇది 92%, 87% ఉంది.

ఈ రంగాల్లో ఎంత శాతం సంతృప్తి అంటే?
నిర్మాణం, టెక్నికల్ కన్సల్టెన్స్, హెల్త్ కేర్ సర్వీస్, సామాజిక పనులు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీస్‌లు, న్యాయ, మార్కెట్ కన్సల్టెన్సీ, వ్యాపార కార్యకలాపాలు వంటి రంగాల్లోని ఉద్యోగులు తమ వృత్తి పట్ల ఎక్కువ సంతృప్తి (84% శాతం)తో ఉన్నారు. నిర్మాణం, టెక్నికల్ కన్సల్టెన్సీ విభాగాల్లో సంతృప్తి స్థాయి 83% వరకు ఉంది.

విద్య, పరిశోధనలో తగ్గిన సంతృప్తస్థాయి
2017తో పోలిస్తే ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ సేవలు అందించే ఉద్యోగుల సంతృప్తి 3 శాతం పెరిగి 75 శాతానికి చేరుకుంది. విద్య, పరిశోధన విభాగం 73 శాతం నుంచి 53 శాతానికి పడిపోయింది.

ఆర్థిక మందగమనం
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అలాగే భారత దేశంలోను ఆర్థిక మందగమనం పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. వేతనాలు రావడం ఆలస్యమైంది. నియామకాలు నిలిచిపోయాయి. ఇంక్రిమెంట్స్ లేకుండా పోయాయి.