పశ్చిమాసియాలో యుద్ధాలు, క్షిపణి ప్రయోగాలు, ఇంధన కొరతతో ప్రపంచం ఆందోళనకరంగా మారిన సమయంలో.. జర్మనీలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న వోక్స్‌వ్యాగన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 50 వేల మంది ఉద్యోగులను 2030 నాటికి తొలగిస్తుందనే సంచలన ప్రకటన వెలుగులోకి వచ్చింది.ఈ పెద్ద స్కేల్ తొలగింపు ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమను ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది. వోక్స్‌వ్యాగన్ అధికారుల ప్రకారం.. ఈ నిర్ణయం కంపెనీ లాభాల ఘనతను కాపాడడానికి, వ్యయాలను తగ్గించడానికి తీసుకోవడం జరిగింది.
Volkswagen గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబల్ మార్కెట్‌లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చైనాలోని ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, ప్రత్యేకంగా BYD కార్లు, యూరోపియన్ మార్కెట్లో పెద్ద సంఖ్యలో అమ్మకానికి రావడం వోక్స్‌వ్యాగన్ ఆర్థిక వ్యవస్థను కలవరపరిచింది. చౌకైన చైనీస్ కార్ల ప్రవేశం, ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల, అమెరికా ప్రభుత్వం విధించిన ప్రత్యామ్నాయ దిగుమతి సుంకాలు అన్నీ కలిపి వోక్స్‌వ్యాగన్ లాభాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

ఉద్యోగులను తొలగించడం ద్వారా దాదాపు 15 బిలియన్ యూరోలు ఆదా చేయగలమని. వోక్స్‌వ్యాగన్ గతంలో 2024 చివరి నాటికి కార్మిక సంఘాలతో ఒప్పందం కుదుర్చి 35 వేల మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించిందని.. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను 50,000 వరకు పెంచిందని కంపెనీ సీఈఓ వార్షిక నివేదికలో తెలిపారు. ఈ తొలగింపు మొత్తం కంపెనీ విభాగాలను, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, R&D, ఉత్పత్తి, అమ్మకాల విభాగాల ఉద్యోగాలను ప్రభావితం చేస్తుంది.
ఉద్యోగులు తమ స్థానాలను కోల్పోవడం మాత్రమే కాక.. కంపెనీ సామర్థ్యం, ఆర్థిక నిర్మాణంలో పెద్ద మార్పులు ఏర్పడనున్నాయి. వోక్స్‌వ్యాగన్ ప్రపంచ వాహన తయారీ, అమ్మకాల మార్కెట్‌లో దీర్ఘకాలిక ఆధిపత్యాన్ని కలిగి ఉండగా, ఇటీవల మార్కెట్ లోకి చైనీస్, ఇతర ప్రత్యామ్నాయ బ్రాండ్లు వచ్చడంతో, దాని ఆధిపత్యం క్షీణించింది. ఈ ఉద్యోగ తొలగింపుతో కంపెనీ వ్యయాలు తగ్గి, లాభాలను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది.
అయితే, ఇది ఉద్యోగుల, సరఫరాదారుల, ప్రపంచ ఆటోమోటివ్ మార్కెట్ పై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగిలిన ఉద్యోగులు మరింత ప్రాముఖ్యత గల ప్రాజెక్టులు, కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాల్సి వస్తుంది.
ఏదేమైనా వోక్స్‌వ్యాగన్ 2030 నాటికి 50 వేల మంది ఉద్యోగులను తొలగించే నిర్ణయం, ట్రంప్-అమెరికా టారిఫ్‌లు, చైనీస్ మార్కెట్ ఉత్పత్తులు, గ్లోబల్ పోటీ అన్నీ కలిపి తీసుకున్న వ్యూహాత్మక అడుగుగా చూడవచ్చు. ఇది కంపెనీ ఆర్థిక పరిస్థితిని స్థిరపరచడానికి, వ్యయాలను తగ్గించడానికి, భవిష్యత్తులో ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి ఉద్దేశించబడింది. అయినప్పటికీ ఈ నిర్ణయం కార్మికులు, స్థానిక మార్కెట్లు, అంతర్జాతీయ ఆటో పరిశ్రమలో గట్టి కలవరాన్ని సృష్టించింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications