For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ స్థాయిలో..: మైక్రోసాఫ్ట్‌లో భారత యువతకు మరిన్ని అద్భుత అవకాశాలు

|

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియాలో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. నోయిడాలో సరికొత్త డెవలప్‌మెంట్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం తెలిపింది. ఇండియాలో మైక్రోసాఫ్ట్‌కు ఇది మూడో హబ్. ఇది ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ హబ్‌గా సేవలు అందించనుంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. తాజాగా 'ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (IDC)-ఎన్సీఆర్'ను ప్రారంభిస్తోంది.

కార్వీలాంటి మోసాలకు ఇక చెక్, నిబంధనలు కఠినతరం, ఎండీ-చైర్మన్ విభజనకు అందుకే గడువుకార్వీలాంటి మోసాలకు ఇక చెక్, నిబంధనలు కఠినతరం, ఎండీ-చైర్మన్ విభజనకు అందుకే గడువు

కీలక టెక్నాలజీ కేంద్రంగా..

కీలక టెక్నాలజీ కేంద్రంగా..

మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రీసెర్చ్ గ్రూప్, క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ గ్రూప్, ఎక్స్‌పీరియన్స్ అండ్ డివైసెస్‌తో పాటు కోర్ సర్వీసెస్ ఇంజినీరింగ్ అండ్ ఆపరేషన్స్ ఇక్కడ కొనసాగించనున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో ఈ సరికొత్త IDC-NCR మైక్రోసాఫ్ట్ కీలక టెక్నాలజీ కేంద్రంగా మారుతుందని తెలిపింది.

ప్రతిభావంతులు.. ప్రపంచస్థాయి సేవలు

ప్రతిభావంతులు.. ప్రపంచస్థాయి సేవలు

మైక్రోసాఫ్ట్ ముందుగా కట్టిబడిన విధంగానే భారత్‌లోని ప్రతిభావంతులు ప్రపంచస్థాయి సేవలు అందించేందుకు వీలుగా దీనిని నిర్మిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇంటర్నేషనల్ స్థాయిలో డిజిటల్ ఇన్నోవేషన్‌కు అవసరమైన టెక్నాలజీని పంచుకునే వ్యూహంలో భాగంగా ఇక్కడ IDCని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది.

ఉద్యోగాల వెల్లువ

ఉద్యోగాల వెల్లువ

భారత్‌లో మైక్రోసాఫ్ట్ విస్తరణ, వృద్ధిలో ఎన్సీఆర్ ఐడీసీ కీలక పాత్ర పోషిస్తుందని, ఈ కేంద్రాన్ని బెంగళూరు, హైదరాబాద్ స్థాయి ఏడీసీగా వృద్ధి చేసే వేలకొద్ది ఇంజినీర్లకు అవకాశాలు వెల్లువెత్తుతాయని తెలిపింది. ఇక్కడి ఐడీసీ సెంటర్‌లో AI, క్లౌండ్, పరిశోధన, ఎక్స్‌పీరియన్స్ అండ్ డివైజ్ గ్రూప్, కోర్ సర్వీస్ ఇంజినీరింగ్ అండ్ ఆపరేషన్స్‌తో పాటు హౌస్ మిక్సర్, మైక్రోసాఫ్ట్ లైవ్ స్ట్రీమింగ్, గేమింగ్ విభాగాలు ఉండనున్నాయి.

హెడ్ ఆఫీస్ బయట రెండో గేమింగ్

హెడ్ ఆఫీస్ బయట రెండో గేమింగ్

అమెరికాలోని రెడ్‌మాండ్లోని మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్‌లో బయట ఏర్పాటు చేస్తున్న రెండో గేమింగ్ బృందం ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంత మొత్తం పెట్టుబడులు పెడుతుందనే విషయాన్ని వెల్లడించలేదు.

విస్తరించేందుకు ఉత్సాహంగా..

విస్తరించేందుకు ఉత్సాహంగా..

గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో బలమైన ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పుడు తాము దీనిని విస్తరించేందుకు ఉత్సాహంగా ఉన్నామని, ఈ ప్రాంతంలోని అందుబాటులో ఉండే ప్రతిభావంతులైన ఇంజినీర్ల నియమించుకొని ప్రపంచస్థాయి సేవల్ని అందిస్తామని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కుర్త్ దెల్‌బెనె అన్నారు. ఆయన ఐడీసీ అడ్వయిజరీ బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్నారు. తొలి ఐడీసీని 1998లో హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం మైక్రోసాఫ్ట్ విస్తరణలో కీలక పాత్ర పోషించింది.

English summary

హైదరాబాద్ స్థాయిలో..: మైక్రోసాఫ్ట్‌లో భారత యువతకు మరిన్ని అద్భుత అవకాశాలు | Microsoft to hire engineering talent as it sets up hub in Noida

Tech giant Microsoft on Monday said it has set up a new development centre in Noida, its third such facility in India, that will serve as an engineering and innovation hub for the company.
Story first published: Tuesday, February 18, 2020, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X