For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టిక్‌టాక్ ఇండియా కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు! ఒకవేళ అది సఫలం కాకపోయినా..

|

ఇటీవలి కాలంలో టిక్‌టాక్ వంటి చైనీస్ కంపెనీలు అంతర్జాతీయంగా భద్రతాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఇండియా దీనిని బ్యాన్ చేసింది. ఈ పరిస్థితుల్లో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ తమ సంస్థలో వాటాలను ఆయా దేశాల్లో ఆసక్తి కలిగిన వారికి విక్రయించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ అమెరికా సహా మరికొన్ని దేశాలుక చెందిన టిక్‌టాక్ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచింది. అయితే చైనా మినహా మిగతా దేశాన్ని టిక్‌టాక్ కార్యకలాపాలను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి కనబరుస్తోందని వార్తలు వస్తున్నాయి.

310 కోట్ల డాలర్ల అమెజాన్ షేర్లు విక్రయించిన జెఫ్ బెజోస్: 73% పెరిగినా ఎందుకు విక్రయించాడంటే?

ఇండియా సహా ప్రపంచ వ్యాపారాలపై ఆసక్తి

ఇండియా సహా ప్రపంచ వ్యాపారాలపై ఆసక్తి

షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ కొద్దిరోజుల్లోనే బాగా ఫేమస్ అయింది. ఎన్నో దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న టిక్‌టాక్ ఇటీవల భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచిన మైక్రోసాఫ్ట్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 45 రోజుల గడువు ఇచ్చారు. టిక్‌టాక్ కార్యకలాపాలు సొంతం చేసుకోవడానికి చర్చలు జరుపుతున్న మైక్రోసాఫ్ట్.. కేవలం అమెరికా, కెనడాలతో సరిపెట్టకుండా భారత్ సహా అంతర్జాతీయ బిజినెస్‌ను సొంతం చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తోంది. అయితే బైట్ డ్యాన్స్‌తో చర్చల్లో టోటల్ బిజినెస్‌ను కొనుగోలు చేస్తామని చెప్పినట్లుగా వెల్లడి కాలేదని కూడా వార్తలు వస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయకుంటే..

మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయకుంటే..

టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను అమెరికా సంస్థకు విక్రయించాలని, లేదంటే నిషేధం విధిస్తామని హెచ్చరించిన ట్రంప్ నెలన్నర రోజుల గడువు ఇచ్చారు. ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ పేరు తెరపైకి వచ్చింది. అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా బిజినెస్‌లు సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇదివరకే ప్రకటించింది. దీని వ్యాల్యూ 50 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. భారత మార్కెట్ చాలా పెద్దది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌కు భారత కార్యకలాపాలు విక్రయించే విషయంలో చర్చలు కొనసాగుతున్నాయని అంటున్నారు. భారత్, యూరోప్ సహా వివిధ దేశాలను చేర్చే అంశంపై చర్చలు సాగుతున్నాయట. చర్చలు సఫలం కాకపోయినా ఈ కార్యకలాపాలను ఇతర విదేశీ కంపెనీలకు లేదా భారత్‌కు చెందిన సంస్థలకు విక్రయించాలని యోచిస్తోందట.

అలా ఒప్పందం

అలా ఒప్పందం

టెక్నాలజీని పూర్తిగా బదలీ చేసి రెవెన్యూలో వాటాను పొందే విధంగా ఒప్పందం చేసుకోవడానికి బైట్ డ్యాన్స్ యోచిస్తోంది. టిక్‌టాక్‌ను నిషేదించిన తర్వాత రోపోసో, మోజ్, జోష్ వంటి యాప్స్ డౌన్ లోడ్స్ పెరిగాయి.

English summary

టిక్‌టాక్ ఇండియా కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు! ఒకవేళ అది సఫలం కాకపోయినా.. | Microsoft explores buying all of TikTok's global business, including in India

Microsoft Corp is chasing a deal to buy all of TikTok's global business, including operations in India, the Financial Times reported on Thursday, citing five people with knowledge of the talks.
Story first published: Friday, August 7, 2020, 18:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X